Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.
Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్‌లో రన్ అవుతూనే అమెజాన్ ప్రైమ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసిన పలువురు సెలెబ్రిటీస్ అల్లు అర్జున్ యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన రెస్పాన్స్‌ను వ్యక్త పరిచారు. పుష్ప సినిమా ఓ రేంజ్‌లో ఉందని.. అల్లు అర్జున్ యాక్టింగ్ అదిరిపోయిందని.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్ట్ గా నిలవడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. దీంతో నెల్సన్ ట్వీటుకు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతూ రిప్లే ట్వీటు చేశారు. ఇక నెల్సన్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవల శివ కార్తికేయన్‌తో డాక్టర్ అనే సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నెల్సన్ ప్రస్తుతం విజయ్‌తో బీస్ట్ అనే ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప విషయానికి వస్తే.. ఈ సినిమా అన్ని అంచనాలు తగ్గట్టే సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇటు సౌత్‌లో కంటే అటు నార్త్‌లో కేక పెట్టిస్తోంది. అది అలా ఉంటే ఈ చిత్రం హిందీ వెర్షన్ నేపాల్ దేశంలో రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నేపాల్‌లో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా 29వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 5 లక్షల దాకా షేర్’ని సొంతం చేసుకోగా... ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 27 వ రోజున సినిమా 40 లక్షల దాకా షేర్‌ను సాధించింది. పుష్ప 146 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగగా.. ఈ సినిమా ఇప్పటి వరకు 23.15 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్‌గా నిలిచింది.
#pushpa What swag 🔥🔥 superb and commendable performance @alluarjun 🔥💥💥 no wonder it blasted in box office 👍👏
It’s my pleasure @alluarjun garu, looking forward for many more such great performances by you...
I’m very glad you liked doctor,
Thank you very much. https://t.co/wh2dXRIGmg
పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంది పుష్ప. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. పుష్ప ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు బిహార్‌లో మంచి వసూళ్లను రాబడుతోంది.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ వర్షన్ జనవరి 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. పుష్ప సినిమా అన్ని భాషాల్లో కలిపి 300 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను వదిలింది టీమ్. ఈ సినిమా మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. హిందీలో రాకింగ్ స్టార్ నటించిన కేజీయఫ్ చిత్రం లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్ళను అల్లు అర్జున్ పుష్ప కేవలం 13 రోజుల్లో సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల వసూళ్లతో అక్కడ అదరగొట్టింది. పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.
ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ను వస్తోంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. పుష్పను తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు.
పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.