Whistle Movie Review: ‘విజిల్’ మూవీ రివ్యూ..

తాజాగా విజయ్.. అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘బిగిల్’ సినిమా చేసాడు.వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విజిల్’ సినిమా ప్రేక్షకులు అంచనాలు అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూడండి..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: October 25, 2019, 3:06 PM IST
Whistle Movie Review: ‘విజిల్’ మూవీ రివ్యూ..
‘విజిల్’ మూవీ రివ్యూ (twiter/Photo)
  • Share this:
నటీనటులు: విజయ్ ,నయనతార, జాకీ ష్రాఫ్, వివేక్ తదితరులు..

నిర్మాణం : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్

సంగీతం: ఏ.ఆర్.రహమాన్

సినిమాటోగ్రఫీ: G.K.విష్ణుదర్శకత్వం: అట్లీ

తమిళ స్టార్ హీరో విజయ్ ఇమేజ్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ‌ర‌స విజ‌యాల‌తో నెంబ‌ర్ వ‌న్  స్థానంపై కన్నేసాడు ఇళయ ద‌ళ‌ప‌తి. తాజాగా విజయ్.. అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘బిగిల్’ సినిమా చేసాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తేరి‘ మెర్సల్’ సినిమాలు సెన్సేషనల్ క్రియేట్ చేసాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విజిల్’ సినిమా ప్రేక్షకులు అంచనాలు అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే.. 
Loading...
మైఖేల్ రాజప్ప, మైఖేల్ బిగిల్ ఇద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి ఎక్కడ అన్యాయం జరిగిన వెళ్లి వాళ్లను ఎదురిస్తుంటాడు. మరోవైపు కొడుకు బిగిల్ ఇండియన్ ఫుట్‌బాల్ కోసం ఆడుతుంటారు. ఐతే.. జాతీయ స్థాయిలో ఆడే సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురై.. నేషనల్ ఫుట్‌బాల్‌కు ఆడలేకపోతాడు. ఆ తర్వాత తాను సాధించలేనది ఒక మహిళ ఫుట్‌బాల్ టీమ్‌తో సాధించాలనుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన స్టోరీనే ‘విజిల్’ సినిమా.

నటీనటుల విషయానికొస్తే..

‘మెర్సల్’ తర్వాత మరోసారి విజయ్ తండ్రి కొడుకుల పాత్రల్లో మెప్పించాడు. రాజప్ప, బిగిల్ రెండు పాత్రల్లో తనదైన నటనను కనబరిచాడు.రాజప్ప పాత్రలో మాస్‌ను మెప్పించాడు. తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఆయన పాత్రను అట్లీ డిజైన్ చేసినట్టు కనబడుతోంది. బిగిల్‌గా మహిళ ఫుట్‌బాల్ కోచ్ పాత్రలో విజయ్ నటన బాగుంది. నయనతార నటన పర్వాలేదు. మహిళ ఫుట్‌బాల్ ప్లేయర్స్‌గా నటించిన వాళ్లు తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇతర నటీనటులు కూడా ఉన్నంతలో బాగా చేసారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు అట్లీ మొదటి నుంచి తాను తెరకెక్కించే సినిమాల్లో ఏదో సామాజిక అంశాలన్ని హైలెట్ చేస్తూ వస్తున్నాడు. ‘విజిల్’ సినిమాలో మహిళ సాధికారితను చాటి చెప్పాడు. ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు వాళ్లేం చేయగలరన్న భావన ఇప్పటికీ సమాజంలో వేళ్లూనుకుపోయింది. ఆ అంశాన్నే కథా వస్తువుగా తీసుకొని..దానికి విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో కాస్తంత కమర్షియల్ అంశాలు జోడించి ‘విజిల్’ సినిమాను తెరకెక్కించాడు.కమర్షియల్ విషయాలు పక్కన పెడితే కథాపరంగా విజిల్ సినిమాలో మంచి సందేశం ఇచ్చాడు అట్లీ. అనుకుంటే అమ్మాయిలు ఏదైనా సాధిస్తారు అని సినిమాలో చూపించాడు దర్శకుడు..
కాకపోతే తాను అనుకున్న కథను కమర్షియల్ గా చెప్పడంలో అట్లీ కాస్త అక్కడక్కడ కాస్త తడబడ్డాడు. కథనంలో అట్లీ కాస్త వీక్ అయ్యాడు కానీ.. కథ విషయంలో మాత్రం కాదు.ఫస్టాఫ్ లో మాస్ కు నచ్చే లా కమర్షియల్ అంశాలు జోడించే క్రమంలో..
కాస్త తమిళ వాసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమిళ ప్రేక్షకులకు ఇది నచ్చినా.. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఇంటర్వెల్ వరకు సాదా సీదా సినిమాగా కనిపించిన విజిల్.. ఇంటర్వెల్ బాంగ్ నుంచి ఊపందుకుంటుంది. 
అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి ఉమెన్స్ ఫుట్ బాల్ టీం గ్రౌండ్ లోకి అడుగు పెట్టిన తర్వాతా.. విజిల్ టైటిల్ కి తగ్గట్లే కొన్ని చోట్ల విజిల్ వేయిస్తుంది. మొత్తానికి షారుఖ్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ సినిమాను తనదైన స్టైల్లో ప్రీమేక్ చేసినట్టు కనబడుతోంది. మొత్తానికి తన చిత్రంలో మహిళ సాధికారికతను బాగానే చూపించాడు. ఇక ఏ.ఆర్.రహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జి.కే.విష్ణు కెమెరా వర్క్ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. 

ప్లస్

కథ

విజయ్

ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్

ఫస్టాఫ్ సాగతీత

తమిళ నేటివిటీ

అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు

రేటింగ్: 2.75/5

చివరి మాట: మొత్తానికి మహిళ సాధికారతను చాటే మంచి ప్రయత్నం ‘విజిల్’
First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...