కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సంచనాలు నమోదు చేస్తుంటాయి. అలాంటి తరహా చిత్రాల్లో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ సినిమా చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌ను విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు.
కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సంచనాలు నమోదు చేస్తుంటాయి. అలాంటి తరహా చిత్రాల్లో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’ సినిమా చెప్పొచ్చు. 2016లో చడీ చప్పుడు కాకుండా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా సంచనల విజయం సాధించింది. కేవలం రూ. కోటితో రూపాయలతో తెలుగులో విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం ఎవరి అంచనాలకు అందకుండా.. రూ. 20 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీర్పీలే వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని క్రేజ్ అమాంతం పెరిగింది. గత కొన్ని రోజులుగా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రాబోతుందని విజయ్ ఆంటోని పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసాడు. అంతెేకాదు దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్2ను కూడా రిలీజ్ చేసాడు.
ఈ సీక్వెల్‌కు ‘బిచ్చగాడు 2’ అనే టైటిల్ ఖరారు చేసారు. తమిళంలో ’పిచ్చైకారన్ 2’ పేరుతో విడుదలవుతోంది. ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్లో ప్రకటించారు. ఈ సీక్వెల్లో తెలుగులో ఫేమసైనా కొంత మంది నటీనటులు నటించే అవకాశం ఉందట. అప్పట్లో బిచ్చగాడు చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా.. శశి డైరెక్ట్ చేసాడు. ఈ సీక్వెల్‌ను మాత్రం విజయ్ ఆంటోని నిర్మిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు ప్రియ కృష్ణ స్వామికి అప్పగించాడు. మరి బిచ్చగాడు మాదిరిగానే బిచ్చగాడు 2 కూడా సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.