హోమ్ /వార్తలు /సినిమా /

Bichagadu 2 : విజయ్ ఆంటోని మూవీ ’బిచ్చగాడు 2’ నుంచి థీమ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..

Bichagadu 2 : విజయ్ ఆంటోని మూవీ ’బిచ్చగాడు 2’ నుంచి థీమ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..

Vijay Antony - Bichagadu 2  కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సంచనాలు నమోదు చేస్తుంటాయి. అలాంటి తరహా చిత్రాల్లో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’  సినిమా చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Vijay Antony - Bichagadu 2  కొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సంచనాలు నమోదు చేస్తుంటాయి. అలాంటి తరహా చిత్రాల్లో విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’  సినిమా చెప్పొచ్చు. 2016లో చడీ చప్పుడు కాకుండా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా సంచనల విజయం సాధించింది. కేవలం రూ. కోటితో రూపాయలతో తెలుగులో విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం ఎవరి అంచనాలకు అందకుండా.. రూ. 20 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. మరోవైపు టీవీల్లో ప్రసారమైనపు కూడా ఈ సినిమాకు మంచి టీఆర్‌పీలే  వచ్చాయి.  ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని క్రేజ్ అమాంతం పెరిగింది.

  గత  కొన్ని రోజులుగా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ రాబోతుందని విజయ్ ఆంటోని పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. అంతేకాదు విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయడమే కాకుండా.. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసారు. తాజాగా ఈ  సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

  తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆంటీ బికిలీ’ అంటూ బిచ్చగాడు థీమ్ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.  ‘బిచ్చగాడు 2’  టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రాన్ని  తమిళంలో ’పిచ్చైకారన్ 2’ పేరుతో విడుదలవుతోంది. ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి  విడుదల చేయనున్నారు. బిచ్చగాడులో అమ్మపై తీసిన పాటలాగా ఈ సినిమా కూడా ఈ పాట కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. బిచ్చగాడులో బిజినెస్ మ్యాన్ పాత్రలో నటించిన విజయ్ ఆంటోని .. బిచ్చగాడు 2లో గ్యాంగ్ స్టర్‌ పాత్రలో నటించారు. అందులో కన్నతల్లి ఆరోగ్యం కోసం ఓ స్వామిజీ సలహాతో బిచ్చగాడుగా 40 రోజులు దీక్ష చేయడమనేది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. రెండో పార్ట్‌లో ఓ గ్యాంగ్ స్టర్ ఎందుకు బిచ్చగాడుగా మారాల్సి వచ్చిందనేది కథాంశంగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

  Radhe Shyam 5 WW Days Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 5 డేస్ కలెక్షన్స్.. ఇంత కంటే దారుణం మరోకటి ఉండదు..

  ఈ సీక్వెల్‌లో తెలుగులో ఫేమసైనా కొంత మంది నటీనటులు నటించినట్టు సమాచారం. ఈ సినిమా టీజర్ విడుదలైతే కానీ క్లారిటీ ఉండుదు.  అప్పట్లో  బిచ్చగాడు చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా.. శశి డైరెక్ట్ చేసాడు. ఈ సీక్వెల్‌ను మాత్రం విజయ్ ఆంటోని నిర్మిస్తూ.. దర్శకత్వ బాధ్యతలు ప్రియ కృష్ణ స్వామికి అప్పగించాడట. మరి బిచ్చగాడు మాదిరిగానే బిచ్చగాడు 2 కూడా సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా  లేదా అనేది చూడాలి.

  First published:

  Tags: Bichagadu 2, Kollywood, Tollywood, Vijay Antony

  ఉత్తమ కథలు