హోమ్ /వార్తలు /సినిమా /

క్రేజీ రేటుకు విజయ్ సినిమా శాటిలైట్ రైట్స్..

క్రేజీ రేటుకు విజయ్ సినిమా శాటిలైట్ రైట్స్..

Twitter

Twitter

నటుడు విజయ్‌కు తమిళ నాడులో అదిరిపోయే క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ క్రేజ్ ప్రతి యేటా పెరుగుతూపోతోంది.

  నటుడు విజయ్‌కు తమిళ నాడులో అదిరిపోయే క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ క్రేజ్ ప్రతి యేటా పెరుగుతూపోతోంది. దీనికి కారణం విజయ్ బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నాడు. విజయ్‌కు తెలుగులో కూడా ఈ మధ్య మంచి ఆదరణ వచ్చింది. ఆయన తమిళ సినిమాలు వరుసగా తెలుగులో డబ్బ్ అవుతూ మార్కెట్ పెంచుకున్నాడు. అందులో భాగంగా తెలుగులో విడుదలైన అదిరింది, సర్కార్, విజిల్ మూవీస్ ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టాయి. విజయ్ తాజా సినిమా బిగిల్ తెలుగులో విజిల్‌గా విడుదలై ఏకంగా 10కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్‌గా నిలిచింది. అది అలా ఉంటే విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్, కార్తీతో ఖైదీ సినిమా తీసి.. అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో లోకేష్, విజయ్‌ల కాంబీనేషన్‌లో వస్తున్న విజయ్ 64వ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఈ మూవీలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్‌గాను, గ్యాంగ్ స్టర్‌గాను కనిపిస్తారని తెలుస్తోంది. కాగా మూవీపై ఏర్పడ్డ క్రేజ్, డిమాండ్ రీత్యా శాటిలైట్ రైట్స్ కొరకు తీవ్ర పోటీ నెలకొంది. ఆ పోటిలో ఫ్యాన్సీ ధర చెల్లింది సన్ నెట్ వర్క్స్ దేశ వ్యాప్తంగా ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నదని సమాచారం.

  అందాలతో మతిపోగుడుతోన్న నైనా గంగూలీ..

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Tamil Film News, Vijay

  ఉత్తమ కథలు