ఎంత దమ్ముంటే మా హీరోను చంపేస్తారు.. విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్..

అభిమానం అనేది హద్దుల్లో ఉన్నపుడే అందం.. ఆనందం. ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఇప్పటికీ హీరోల కోసం కొట్టుకోవడం.. అభిమానం పేరుతో చంపుకోవడం అనేది చాలా కామెడీగా ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 30, 2019, 5:44 PM IST
ఎంత దమ్ముంటే మా హీరోను చంపేస్తారు.. విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య వార్..
విజయ్, అజిత్ ఫైల్ ఫోటోస్
  • Share this:
అభిమానం అనేది హద్దుల్లో ఉన్నపుడే అందం.. ఆనందం. ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఇప్పటికీ హీరోల కోసం కొట్టుకోవడం.. అభిమానం పేరుతో చంపుకోవడం అనేది చాలా కామెడీగా ఉంటుంది. మిగిలిన ఇండస్ట్రీలలో ఏమో కానీ తమిళనాట మాత్రం ఇలాంటి స్టార్ వార్స్ చాలానే జరుగుతుంటాయి. అక్కడ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కోసం చంపడానికైనా.. చావడానికైనా సిద్ధంగా ఉంటారు. ఒకప్పుడు తిట్టుకోడానికి ఫేస్ టూ ఫేస్ తలపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి.

Vijay Ajith fan war creating sensation in Tamil Industry and Celebrities fired on fans overaction pk అభిమానం అనేది హద్దుల్లో ఉన్నపుడే అందం.. ఆనందం. ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఇప్పటికీ హీరోల కోసం కొట్టుకోవడం.. అభిమానం పేరుతో చంపుకోవడం అనేది చాలా కామెడీగా ఉంటుంది. #RIPactorVIJAY,#RIPactorVIJAY fans,#LongliveVijay,vijay,ajith,thala ajith,ajith kumar,vijay ajith,vijay vs ajith,vijay and ajith,vijay movies,ajith fans,thalapathy vijay,vijay & ajith,vijay or ajith,vijay ajith mass,vijay fans,arun vijay,vijay ajith fight,vijay ajith scenes,vijay & ajith movie,about vijay and ajith,vijay and ajith fight,vijay and ajith movies,ajith movies,ajith latest,ajith vijay,ajith vijay movie,విజయ్,అజిత్,కోలీవుడ్ వార్తలు,విజయ్ అజిత్ ఫైట్,
విజయ్ బిగిల్ సినిమా ఫస్ట్ లుక్


వాళ్లు కలిసినపుడు చాలా స్నేహంగా ఉంటారు. వాళ్ల కుటుంబాలు కూడా కలిసి పార్టీ చేసుకుంటాయి. కానీ వాళ్ల ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అదేం పిచ్చో మరి.. దుంపకు లేని బాధ కత్తికి ఎందుకు అన్నట్లు హీరోలకు లేని ఇగోలు ఫ్యాన్స్ మధ్య ఉంటాయి అక్కడ. కోపం వస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు వాళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. అజిత్ ఫ్యాన్స్‌కు ఎందుకో విజయ్‌పై కోపం వచ్చింది. అంతే మరో ఆలోచన లేకుండా #RIPactorVIJAY అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేసారు. దాంతో విజయ్ అభిమానులు కంగారు పడ్డారు.


సెలబ్రిటీస్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అలాంటి పని చేసిన ఆకతాయిలను మందలించారు. ఇక విజయ్ ఫ్యాన్స్ కూడా ఊరికే ఉండలేదు. తమ ప్రతాపం కూడా చూపించారు. వాళ్లు #RIPactorVIJAY అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తే.. వీళ్లు #LongliveVijay అంటూ మరో హ్యాష్ ట్యాగ్‌ని క్రియేట్ చేసి దాన్ని ట్రెండ్ చేశారు. ఈ స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా కోపంతో మనుషులను కూడా చంపేసేంత పిచ్చి అభిమానం మాత్రం మంచిది కాదని చెబుతున్నారు విశ్లేషకులు. మరి దీన్ని వాళ్లెంత వరకు పట్టించుకుంటారనేది చూడాలిక.
First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు