news18-telugu
Updated: June 22, 2020, 5:11 PM IST
విఘ్నేశ్ శివన్, నయనతార Instagram
నిజం గడపదాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందనే రీతిలో మన దగ్గర నిజమైన న్యూస్ కంటే ఫేక్ న్యూస్ తొందరగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా నయనతారకు కరోనా సోకిందనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అంతేకాదు నయనతారతో పాటు ఆమె ప్రియుడు కూడా కోవిడ్ -19తో బాధపడుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కూడా. అంతేకాదు వీరిద్దరు ప్రత్యేకంగా కొంత మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న న్యూస్ నెటింట్లో చక్కర్లు కొట్టాయి. మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు కూడా పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన నయనతార పీఆర్ టీమ్ ఆమెకు కరోనా సోకలేదు. ఆమె ఆరోగ్యంగా ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నయనతార ఆరోగ్యంతో పాటు తన హెల్త్ విషయమై వస్తున్న వార్తలపై నయనతార ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు.
మేమిద్దం ఎంతో హెల్తీగా ఉన్నామని చెబుతూ.. ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసాడు. ఈ వీడియోలో నయనతార, విఘ్నేష్ శివన్..చిన్నపిల్లల్లా ఎంతో హుషారుగా ఉన్న వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది. మేము కరోనా బారిన పడ్డాం అంటున్న వస్తున్న వార్తల్లో నిజంలేదు. మేమిద్దం ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామని చెప్పడానికే ఈ వీడియోను పోస్ట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇలాంటి వాటిని క్రియేట్ చేస్తోన్న జోకర్స్ని, వాళ్ల జోక్స్‌ని చూసి నవ్వుకునే ఆరోగ్యాన్ని మాకు దేవుడు ప్రసాదించాడని చెప్పాడు.
First published:
June 22, 2020, 5:09 PM IST