VIDYUT JAMMWAL FEATURES WITH VLADIMIR PUTIN AND BEAR GRYLLS IN 10 PEOPLE YOU DONT WANT TO MESS WITH LIST
Vidyut Jammwal: పుతిన్, బియర్ గ్రిల్స్ సరసన బాలీవుడ్ యాక్షన్ హీరో..
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ అరుదైన గుర్తింపు సాధించాడు. మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్‌లో అత్యంత ప్రావీణ్యత సాధించిన ప్రపంచంలోని టాప్-10 సెలబ్రిటీల జాబితాలో విద్యుత్ జమాల్ చోటు దక్కించుకున్నాడు
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ అరుదైన గుర్తింపు సాధించాడు. మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్‌లో అత్యంత ప్రావీణ్యత సాధించిన ప్రపంచంలోని టాప్-10 సెలబ్రిటీల జాబితాలో విద్యుత్ జమాల్ చోటు దక్కించుకున్నాడు. ‘ఎవరితో పెట్టుకున్నా వీరితో పెట్టుకోకండి..’ అనే అంశం ఆధారంగా ‘ది రిచెస్ట్’ యూట్యూబ్ ఛానల్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బియర్ గ్రిల్స్‌తో పాటు మన దేశం నుంచి విద్యుత్ జమాల్ ఒక్కడే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. యాక్షన్ హీరోగా బాలీవుడ్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ విద్యుత్ జమాల్‌కు గుర్తింపు ఉంది. చైనాకు చెందిన షావోలిన్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు షిపు షి యాన్ మింగ్, జర్మనీకి చెందిన విటో పిర్బజరి, బ్రిటన్‌కు చెందిన గిగా ఉగురు, జపాన్‌కు చెందిన హట్సుమి మసాకి, జేడీ అండర్సన్(అమెరికా) తదితరులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
విద్యుత్ జమాల్‌కు కేరళకు చెందిన కలరిపయాట్టు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత ఉంది. మూడేళ్ల వయస్సు నుంచే ఈ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ప్రారంభించాడు. దాదాపు 25 దేశాల్లో మార్షల్ ఆర్ట్స్‌లో లైవ్ ప్రదర్శనలతో చూపరులను అలరించాడు. దేశ, విదేశాల్లో అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా జమాల్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. విద్యుత్ జమాల్ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని నెటిజన్స్ కొనియాడారు. యాక్షన్ మూవీస్‌లో విద్యుత్ జమాల్‌కు దరిదాపుల్లో కూడా ఇతర ఏ హీరో లేరని పేర్కొన్నారు.