హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవిగా ఒదిగిపోయిన విద్యా బాలన్...

#ShakuntalaDeviFirstlook : విద్యా బాలన్.. అన్ని భావాలను పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది.

news18-telugu
Updated: September 16, 2019, 12:17 PM IST
హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవిగా ఒదిగిపోయిన విద్యా బాలన్...
Twitter/vidya_balan
news18-telugu
Updated: September 16, 2019, 12:17 PM IST
విద్యా బాలన్.. అన్ని భావాలను పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది. తెలుగులో ఈ భామ బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రలో నటిస్తూ... ఎమోషనల్ సీన్లలో కట్టిపడేశారు విద్యా. అది అలా ఉంటే విద్యా బాలన్ ప్రస్తుతం మరో బయోపిక్‌లో నటిస్తున్నారు. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'శకుంతలా దేవి- హ్యూమన్ కంప్యూటర్’ అనే బయోపిక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది.


ఎప్పటిలాగే విద్యా బాలన్.. శకుంతలా దేవి లుక్‌లో ఒదిగిపోయింది. చిన్నగా ఉన్న జట్టుతో, ఎరుపు రంగు చీరలో శకుంతలా దేవిగా విద్యా... చాలా అందంగా కనిపిస్తున్నారు. మహిళా దర్శకురాలు అను మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాతో విద్యా బాలన్ నటించే నాలుగో బయోపిక్ అని చెప్పొచ్చు. ఆమె గతంలో ‘ది డర్టీ పిక్చర్’ అనే సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో జీవించేశారు. తాజాగా ‘మిషన్ మంగళ్’ సినిమాలో స్పేస్ సైంటిస్ట్ తారా షిండేగా మరో నిజ జీవిత పాత్రలో నటించారు.
తాజా బయోపిక్... శకుంతల దేవి విషయానికి వస్తే.. ఆమెను ప్రాణం ఉన్న కంప్యూటర్‌తో పోల్చేవారు. ఆమె తన ఐదవయేటనే.. 18 సంవత్సరాల పిల్లలకు సంబందించిన గణిత సమస్యల్నీ అలవోకగా సాల్వ్ చేస్తూ... అదరగొట్టింది. అంతేకాదు.. పది డిజిట్ల అంకెల్నీ.. మరో పది డిజిట్ల అంకెలతో చిటికెల్లో గుణిస్తూ.. ఆమె చెప్పడం ఓ అద్భుతం. ఈ అమోఘమైన టాలెంట్‌‌‌తో శకుంతల దేవి 1982వ సంవత్సరంలో గిన్నీస్ బుక్‌ రికార్డ్‌ల్లోకెక్కారు. అయితే ఆమె కేవలం గణిత శాస్త్రవేత్తనే కాదు.. ఓ రచయిత కూడా. హోమోసెక్సువల్స్‌పై  ఆమె ‘ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్’ అంటూ ఓ బుక్ రాశారు. ఈ బుక్ ఇండియాలోనే స్వలింగ సంపర్కులపై రాసిన మొదటి పుస్తకంగా గుర్తింపు పొందింది. అది అలా ఉంటే ఆమె జీవితం ఆధారంగా వస్తున్న ఈ సినిమా 2020 వేసవిలో విడుదలకు సిద్దమవుతోంది.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...