Mahesh Babu-Vidya Balan : మహేష్ సినిమాలో విద్యా బాలన్ కీలక పాత్ర..

Mahesh Babu-Vidya Balan : విద్యా బాలన్.. ఎలాంటీ భావాలైనా పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది.

news18-telugu
Updated: September 16, 2020, 10:25 AM IST
Mahesh Babu-Vidya Balan : మహేష్ సినిమాలో విద్యా బాలన్ కీలక పాత్ర..
విద్యా బాలన్ Photo : Twitter
  • Share this:
విద్యా బాలన్.. ఎలాంటీ భావాలైనా పలికించగల అద్భుత నటి. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ.. అదరగొడుతోంది. తెలుగులో ఈ భామ బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో బసవతారకం పాత్రలో నటిస్తూ... ఎమోషనల్ సీన్లలో కట్టిపడేసింది. అది అలా ఉంటే ఈ భామ తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటగా వస్తోన్న సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఇక ఈ సినిమాను పరుశురామ్ సోషల్ మెసేజ్‌ కథతో తెరకెక్కించనున్నాడు. ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక మరోవైపు సోషల్ మెసేజ్‌తో పాటు అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. అందులో భాగంగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడని తెలుస్తోంది. కాగా మొదటి నుండి ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారాను అనుకున్నారు. అయితే ఆమె హిందీలో బిజీగా ఉండడంతో కీర్తి సురేష్‌‌కు చిత్రబృందం ఫిక్స్ అయ్యింది.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి.. షూటింగ్‌కు రెడీ అవుతోంది చిత్రబృందం. అందులో భాగంగా తొలి షెడ్యూలు షూటింగును అక్టోబర్ నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో ఇక ఆలస్యం చేయకుండా షూటింగ్ రెడీ అవుతోందట చిత్రబృందం. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ 45 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 16, 2020, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading