Vidya Balan: కెరీర్ తొలినాళ్లలో ఎన్నోకష్టాలు అనుభవించాను..విద్యాబాలన్..

కెరీర్ తొలినాళ్లలో విద్యాబాలన్ చాలా కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది. అవకాశాలు దొరక్క తాను ఎన్నో అవమానాలు భరించానని, కన్నీళ్లతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు విద్యాబాలన్ తన బాధలను ఏకరవు పెట్టింది. మిషన్ మంగళ్‌యాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విద్యా తన పర్సనల్ విషయాలు పంచుకుంది.

news18-telugu
Updated: August 26, 2019, 8:39 PM IST
Vidya Balan: కెరీర్ తొలినాళ్లలో ఎన్నోకష్టాలు అనుభవించాను..విద్యాబాలన్..
విద్యాబాలన్ (Image: Vidya Balan / Facebook)
news18-telugu
Updated: August 26, 2019, 8:39 PM IST
లేటు వయస్సులో కెరీర్ ప్రారంభించిన విద్యాబాలన్ తొలి నాళ్లలో అడ్వర్టయిజ్ మెంట్స్ లో నటించానని చెప్పుకొచ్చింది. టాలెంట్ ఉన్నప్పటికీ కారణం ఏంటో చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని వాపోయింది. అప్పట్లో 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో విద్యాబాలన్‌కు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. ఈ రకంగా కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని చెప్పుకొచ్చింది ఈ సౌత్ సుందరి. విద్యాబాలన్ తన గురించి చెబుతూ..తాను  మామూలు మధ్యతరగతి నుంచి వచ్చానని,  తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని విద్యాబాలన్ తెలిపింది. బాలీవుడ్‌లో ‘పరిణీత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘డర్డీ పిక్చర్స్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది.

Bollywood Heroins vidya balan to katrina kaif Who acted nandamuri Balakrishna.. here are the details,balakrishna,happy birth day balakrishna nandamuri,ntr kathanayakudu mahanayakudu,ntr biopic balakrishna vidya balan,balakrishna katrina kaif allari pidugu,bharath movie,katrina bharath movie review,balakrishna act with bollywood heroins,balakrishna bollywood heroins,balakrishna nandamuri,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,balakrishna movies,tollywood,nandamuri balakrishna,bollywood,tollywood news,balakrishna dialogues,tollywood heros,balakrishna hot with heroines,balakrishna date with heroine,balakrishna's date night with heroine,balakrishna video songs,bollywood heroine said no for balakrishna,tollywood heroins,bala krishna want to romance with young heroines,tollywood heroes with their wives,tollywood heroines,andhra pradesh news,andhra pradesh politics,balakrishna hindupur,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ బాలీవుడ్ హీరోయిన్స్,బాలకృష్ణ సరసన బాలీవుడ్ భామలు,బాలయ్యతో బాలీవుడ్ భామలు,బాలకృష్ణతో ముంబాయి హీరోయిన్స్.బాలకృష్ణతో హిందీ ముద్దుగుమ్మలు,బాలకృష్ణ పుట్టినరోజు,
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్


తెలుగులో ఈ భామ బాలకృష్ణ హీరోగా నటించిన‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నందమూరి బసవతారకం పాత్రలో నటించింది. ఆ తర్వాత అజిత్ హీరోగా నటించిన ‘నేర్కొండ పార్వాయి’ మూవీలో కథానాయికగా మెరిసింది. ప్రస్తుతం ఈ భామ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...