HOME »NEWS »MOVIE »vidya balan natkhat movie to nominated oscar 2021 short film category ta

Vidya Balan: విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం.. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ‘నట్‌కట్’ మూవీ..

Vidya Balan: విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం.. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ‘నట్‌కట్’ మూవీ..
ఆస్కార్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో నామినేట్ అయిన విద్యాబాలన్ ‘నట‌కట్’ మూవీ (Twitter/Photo)

Vidya Balan - Natkhat | విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం.. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ఆమె నటించి తొలిసారి నిర్మించిన  ‘నట్‌కట్’ మూవీకి చోటు దక్కింది.

  • Share this:
    Vidya Balan - Natkhat| విద్యా బాలన్ చిత్రానికి అరుదైన గౌరవం.. ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ఆమె నటించి తొలిసారి నిర్మించిన  ‘నట్‌కట్’ మూవీకి చోటు దక్కింది. విద్యా బాలన్ విషయానికొస్తే..  భారత దేశం గర్వించదగ్గ అద్భుత నటీమణుల్లో ఆమె ఒకరు. అంతేకాదు పాత్ర తగ్గట్టు అన్ని భావాలు పలికించగలడంతో పాటు విద్యా బాలన్ సొంతం. ఇటు గ్లామర్‌గా కనపడుతూనే అటూ సీరియస్ పాత్రల్లో నటిస్తూ మెప్పించడం విద్యాకే చెల్లింది. తెలుగులో ఈ భామ బాలకృష్ణ సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించి... ఎమోషనల్ సీన్లలో కట్టిపడేశారు. అంతేకాదు గతేడాది ఈ భామ ‘శకుంతల దేవి’ బయోపిక్‌లో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి పాత్రలో ఒదిగిపోయింది. తాజాగా ఈమె ‘నట్‌ఖట్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసింది. ఈ చిత్రం 2020 యేడాడిగాను భారతీయ షార్ట్ ఫిల్మ్ పురస్కారల్లో విజేతగా అవార్డు కైవసం చేసుకుంది.

    ‘నట్‌కట్’ చిత్రంలో విద్యాబాలన్ ఓ అల్లరి పిల్లాడి తల్లి పాత్రలో నటించింది. ఇక ‘నట్‌కట్’ అంటే అల్లరి చేసే వాళ్లను నట్‌కట్ అని పిలుస్తుంటారు. ఒక అల్లరి పిల్లాడు, ఓ తల్లి కథే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా తాజాగా 2021 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్ రేసులో నిలవడంపై నిర్మాణ సంస్థ ఆర్‌ఎస్‌వీపీ, విద్యాబాలన్ సంతోషం వ్యక్తం చేసారు.  ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ కావడంపై ప్రియాంక చోప్రా సహా పలువురు విద్యాబాలన్‌కు కంగ్రాట్స్ తెలిపారు. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కెటగిరిలీలో తప్పుకుండా ఆస్కార్ అవార్డు సాధిస్తుందని ఆషాభావం వ్యక్తం చేసారు.




    విద్యాబాలన్ ‘నట్‌ఖట్’ చిత్ర విషయానికొస్తే.. ఈ సినిమా పితృస్వామ్య పోకడలు, లింగ వివక్ష, గృహ హింసకు వ్యతిరేకంగా దర్శకుడు షాన్ వ్యాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విద్యాబాలన్ .. సోనూ అనే ఒక అల్లరి అబ్బాయి షాన్ వ్యాస్ తల్లి పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని విద్యాబాలన్.. రోనీతో కలిసి నిర్మించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 17, 2021, 08:52 IST

    टॉप स्टोरीज