హోమ్ /వార్తలు /సినిమా /

Vidya Balan: డర్టీ పిక్చర్ ఫోజు ఇస్తుండగా.. విద్యాబాలన్ నడుం పట్టేసిందిగా..!

Vidya Balan: డర్టీ పిక్చర్ ఫోజు ఇస్తుండగా.. విద్యాబాలన్ నడుం పట్టేసిందిగా..!

విద్యా బాలన్ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)

విద్యా బాలన్ లేటెస్ట్ ఫోటోస్ (Instagram/Photo)

విద్యాబాలన్ నటించిన డర్టి పిక్చర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో ఆమె సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించి అందర్నీ మెప్పించారు.

విద్యబాలన్.. బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరు. సౌతిండియా నుంచి వచ్చిన బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. ఇక ఈ సెక్సీ బ్యూటీ తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక విద్యా బాలన్ నటించిన డర్టీ పిక్చర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. అయితే తాజాగా విద్యా బాలన్ డర్టి పిక్చర్‌లోని ఓ ఫోజు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో విద్యా బాలన్ డర్టీ పిక్చర్ ఫోజుఇస్తుండగా.. ఆమె లేస్తున్న క్రమంలో ఒక్కసారిగా నడం పట్టేసింది.

దీంతో విద్యా బాలన్ అక్కడే ఔచ్ అంటూ నడుం పట్టుకొని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సిల్క్ బాలన్ ఒకరు కామెంట్ చేస్తే.. సో క్యూట్ అంటూ మరొకరు పోస్టు పెట్టారు. మరికొందరు.. 18 ప్లస్ ఉన్నవాళ్లు కేర్ ఫుల్ అంటూ..కామెంట్ చేశారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు.

సిల్క్ స్మిత జీవిత ఆధారంగా ‘డర్టీ పిక్చర్’ అనే చిత్రం తీసిన సంగతి తెలిసిందే. ఓ చిన్న టౌన్ నుండీ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయికి … ‘నీ మోహం అద్దంలో చూసుకున్నావా… నీకు సినిమా అవకాశాలు ఇస్తారా.. సైడ్ క్యారెక్టర్ లకు కూడా పనికి రావు’ అని విమర్శించారు. దాంతో వ్యాంప్ పాత్రలు చేసి హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకుంది సిల్క్ స్మిత. అయితు సిల్క్ స్మిత  బయోపిక్ లో నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. చాలా మంది ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసారట.

విద్యాబాలన్ ఈ పాత్రకు ఒప్పుకుంది. ఇందుకు చాలా మంది ఈమెను తిట్టారట. ‘శకుంతల దేవి’ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. కానీ తన తల్లిదండ్రులు మాత్రం అడ్డు చెప్పలేదన్నారు. డర్టి పిక్చర్‌లో విద్యాబాలన్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.  విద్యా బాలన్ జనవరి 1న కేరళలో పుట్టింది. ఆమె  తండ్రి పి.ఆర్.బాలన్. తల్లి సరస్వతీ బాలన్. చిన్నతనంలోనే మాధురీ దీక్షిత్ నటనతో ఇన్‌స్పైర్ అయిన విద్య సినిమా రంగంలో అడుగు పెట్టాలని ఆశపడేది. ముంబైలో పెరిగింది. సెయింట్ ఆంథొనీ గల్స్ హయ్యర్ స్కూల్, చెంబూరులో చదివింది. ఆపై సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.


పదహారేళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన 'హమ్ పాంచ్' అనే హిందీ సీరియల్లో నటించించి విద్యాబాలన్. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నట్టు ఇంట్లో చెబితే ముందు చదువు పూర్తిచేయమన్నారట. అలా సోషియాలజీలో ముంబయి యూనివర్శిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందింది. ఆ తర్వాత మెల్లగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది . మొదట మలయాళంలో మోహన్‌లాల్ సరసన చక్రం సినిమాకు సైన్ చేసింది. కానీ నిర్మాణంలో సమస్యలు తలెత్తడం వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆపేశారు.

దాంతో మలయాళం ఇండస్ట్రీలో విద్యకు 'ఐరెన్‌లెగ్'గా పేరు పెట్టేశారు.

దాంతో తమిళంపై దృష్టి పెట్టింది. 2002లో రన్ సినిమాలో ఈమెను హీరోయిన్‌గా ఎంచుకున్నా తర్వాత మీరాజాస్మిన్‌తో రీప్లేస్ చేశారు. అలాగే మనసెల్లం సినిమాలో తీసుకుని త్రిషా కృష్ణన్‌తో రీప్లేస్ చేశారు.  2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. అది ఫర్వాలేదనిపించడంతో సంజయ్‌దత్ సరసన లగే రహో మున్నాభాయ్‌లో జాహ్నవిగా ఒక వెలుగు వెలిగే అవకాశం కొట్టేసింది.

First published:

Tags: Bollywood, Instagram, Vidya Balan

ఉత్తమ కథలు