90ల్లో దూరదర్శన్‌లో షారుక్ ఖాన్ యాంకరింగ్... వైరల్ వీడియో...

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా... ఒకప్పుడు డీడీలో యాంకరింగ్ చేసేవాడంటే చాలా మంది నమ్మలేరు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 10:11 AM IST
90ల్లో దూరదర్శన్‌లో షారుక్ ఖాన్ యాంకరింగ్... వైరల్ వీడియో...
90ల్లో దూరదర్శన్‌లో షారుక్ ఖాన్ (Credit - Insta - bollywooddirect)
Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 10:11 AM IST
Shah Rukh Khan : బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌కి అశేష అభిమానులున్నారు. పాకిస్థాన్‌తో పాటూ చాలా దేశాల్లో ఆయన సినిమాలను ఎంతో ఆసక్తిగా చూస్తారు. అంతలా ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న బాద్షా... ఒకప్పుడు దూరదర్శన్‌లో యాంకరింగ్ చేసేవాడని చాలా మందికి తెలియదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టక ముందు షారుక్ కొన్ని టీవీ షోలు చేశాడు. తన కెరీర్ ప్రారంభంలో చాలా కామెడీ, ఇతర టీవీ షోలకు యాంకరింగ్ చేశాడు. అలాంటి వాటిలో న్యూఇయర్ సందర్భంగా దూరదర్శన్‌లో జరిగిన షోలో షారుక్... కో-యాంకర్‌గా ఉన్న క్లిప్ ఒకటి ఇప్పుడు బయటికొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని బాలీవుడ్ డైరెక్ట్ అనే పేజీలో ఈ క్లిక్ షేర్ అయ్యింది. ఈ పేజీలో తరచుగా ఇలాంటి బాలీవుడ్ సెలబ్రిటీల గత జ్ఞాపకాల క్లిప్స్ షేర్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అయిన క్లిప్‌లో షారుక్... బ్యాగీ ట్రౌజర్స్, షర్ట్‌లో కనిపిస్తూ... 90ల్లో పేరున్న సింగర్ కుమార్ సానూను ఇంట్రడ్యూస్ చేశాడు. 
Loading...

View this post on Instagram
 

#ShahrukhKhan as a tv anchor for a singing programs of #Doordarshan. #srk #shahrukh


A post shared by Bollywoodirect (@bollywoodirect) on

1992లో దీవానా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు షారుక్. రాజు బన్ గయా జంటిల్మేన్, కింగ్ అంకుల్, బాజీగర్, దార్ వంటి సినిమాలు... షారుక్ ఖాన్‌ ఇండస్ట్రీలో పాతుకుపోయేలా చేశాయి. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు ఆయన్ని స్టార్ హీరోగా మార్చేశాయి. ఐతే... ఒకప్పుడు షారుక్ పరిచయం చేసిన... అదే కుమార్ సానూ... షారుక్ సినిమాలైన బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, ఎస్ బాస్, కరణ్ అర్జున్, కభీ హాన్ కభీ నా, దీవానా లాంటి చాలా సినిమాల్లో పనిచేస్తున్నారు.

షారుక్ చివరి సినిమా జీరో. అది ఫ్యాన్స్‌ని హర్ట్ చెయ్యడంతో... నెక్ట్స్ ఏ సినిమానూ ఎనౌన్స్ చెయ్యలేదు. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడని తెలిసింది.
First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...