‘మీటూ’ ఉన్నదింత... చేస్తోందంత... ప్రీతీజింటా సెన్సేషనల్ కామెంట్స్

బాలీవుడ్ ఇండస్ట్రీ మహిళలకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్... కొంతమంది ప్రచారం కోసమే ఆరోపణలు చేస్తున్నారు... యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ నటి ప్రతీజింటా... సొట్టబుగ్గల సుందరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 19, 2018, 7:22 PM IST
‘మీటూ’ ఉన్నదింత... చేస్తోందంత... ప్రీతీజింటా సెన్సేషనల్ కామెంట్స్
ప్రీతి జింటా
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 19, 2018, 7:22 PM IST
‘మీటూ’ మూమెంట్ ఉన్నదింత... దాన్ని కొందరు చేస్తోందింత... బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మహిళలకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఇండస్ట్రీ... నాకు మీటూ మూమెంట్ ఎదురుకాలేదు... అయ్యి ఉంటే చాలా బాగుండేది...’ ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు, బాలీవుడ్ సీనియర్ నటి ప్రతీజింటా. ఈ సొట్టబుగ్గల సుందరి ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ బాలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తోంది. మహిళల హక్కుల కోసం, భద్రతల కోసం ‘మీటూ’ ద్వారా పోరాటం చేస్తున్నామని కొందరు బాలీవుడ్ నటీమణులు చెప్పుకుంటున్న తరుణంలో ప్రీతిజింటా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా... ‘బాలీవుడ్ హంగామా’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో మీటూ మూమెంట్ గురించి అమ్మడు చేసిన కామెంట్లనే హైలెట్ చేస్తూ ప్రోమో విడుదల చేసింది సదరు ఛానెల్. ఇందులో ‘మీటూ’ మూమెంట్ మీకెప్పుడు ఎదురుకాలేదా...అని విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రీతిజింటా నవ్వుతూ ‘లేదు... నాకెప్పుడు అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అయ్యి ఉంటే బాగుండేది...మీ ప్రశ్నకు జవాబు దొరికేది’ అంది.
Video of Preity Zinta’s Take on #MeToo Goes Viral, She Calls It ‘Edited and Insensitive' ‘మీటూ’ ఉన్నదింత... చేస్తోందంత... ప్రీతీ జింటా సెన్సేషనల్ కామెంట్స్

మనం ఉండే విధానాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి మనల్ని చూసే విధానం మారుతుంది. నాకెప్పుడూ అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ మహిళలకు చాలా సేఫ్. కొంతమంది కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారు. అక్కడ ఉన్నదింత... వీళ్లు చేస్తోంది అంత...
ప్రీతి జింటా, ఇంటర్వ్యూ ప్రోమోVideo of Preity Zinta’s Take on #MeToo Goes Viral, She Calls It ‘Edited and Insensitive' ‘మీటూ’ ఉన్నదింత... చేస్తోందంత... ప్రీతీ జింటా సెన్సేషనల్ కామెంట్స్
ప్రీతిజింటా ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో సెటర్ల వర్షం కురుస్తోంది. 2014లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వ్యాపారవేత్త నెస్వాడియా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చేసిన ప్రీతిజింటా... అప్పుడెందుకు అతనితో ఎందుకలా స్పందించిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ‘రాఖీసావంత్ అంటే అనుకోవచ్చ...మీరు కూడా ఇలా మాట్లాడతారా...’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ప్రీతిజింటా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘నేను ఆ రోజు 20 ఇంటర్వ్యూలు ఇచ్చాను. కానీ వీళ్లు మాత్రమే సెన్సేషన్ కోసం ఇలా ఎడిట్ చేశారు... డిస్పాయింటెండ్’ అంటూ ట్వీట్ చేసింది ప్రీతిజింటా.
First published: November 19, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...