హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: ట్రాఫిక్ పోలీస్‌తో రామ్ చ‌ర‌ణ్ అలా..! వీడియో వైరల్

Ram Charan: ట్రాఫిక్ పోలీస్‌తో రామ్ చ‌ర‌ణ్ అలా..! వీడియో వైరల్

Rc15 Ram Charan Shankar (Photo Twitter)

Rc15 Ram Charan Shankar (Photo Twitter)

RC15: రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాజమౌళితో (SS Rajamouli) RRR రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారట.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చెన్నైలో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడి రోడ్డుపై కొన్ని స‌న్నివేశాల‌ను షూట్ చేస్తుండగా ఎవరో సెల్ ఫోన్ తో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ ట్రాఫిక్ పోలీస్‌ను ఆట ప‌ట్టిస్తూ స్టెప్పులేస్తున్నట్లు కనిపిస్తున్నారు రామ్ చరణ్ .


ఓ పక్క భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తూనే చిత్రంలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపడుతున్నారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చూడబోతున్నామట. చిత్ర క్లైమాక్స్ పార్ట్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ కోసం శంకర్ ఓ రేంజ్ ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు పాటు ఉండనుందని, ఇందుకోసం ఏకంగా 20 కోట్లు కేటాయించారని తెలుస్తోంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలక్షన్ కమీషనర్‌గా కనిపించనున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానుల్లో ఆయన లుక్ ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ భారీ మూవీపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, RC 15, Shankar

ఉత్తమ కథలు