హోమ్ /వార్తలు /సినిమా /

Mosagallu: మంచు విష్ణు ’మోసగాళ్లు’ సినిమా కోసం రంగంలోకి దిగిన వెంకటేష్..

Mosagallu: మంచు విష్ణు ’మోసగాళ్లు’ సినిమా కోసం రంగంలోకి దిగిన వెంకటేష్..

వెంకటేష్ (Twitter/Photo)

వెంకటేష్ (Twitter/Photo)

Manchu Vishnu-Venkatesh Mosagallu : గత కొన్నేళ్లుగా మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు మోసగాళ్లు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం సీనియర్ హీరో వెంకటేష్ రంగంలోకి దిగాడు.

ఇంకా చదవండి ...

  Manchu Vishnu : గత కొన్నేళ్లుగా మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’, ఆ తర్వాత చేసిన ఓటర్ సినిమాలు కూడా మంచు విష్ణును తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ఇపుడు మంచు విష్ణు ఇప్పుడు పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ కథతో వస్తున్నాడు. కాజల్‌, ఈయన జంటగా మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ,తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.  ఆ మధ్య ఈ సినిమాకు సంబందించి పోస్టర్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌ను అల్లు అర్జున్ రిలీజ్ చేసాడు. ఈ సినిమా విషయానికొస్తే..  2016లో జరిగిన 450 మిలియన్ డాలర్ల స్కామ్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.

  అంతేకాదు అందుకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా వెంకటేష్ కంప్లీట్ చేసాడు. దానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. మరి వెంకీ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమాకు హైప్ పెరిగింది. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.

  మంచు విష్ణు మోసగాళ్లు సినిమా (mosagallu movie)

  మంచు విష్ణు కెరీర్ చూస్తే.. స్టార్ హీరో  మోహన్ బాబు కుమారుడిగా పరిచయమై విష్ణు చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్నీ అలరించలేకపోయాయి. అయితే ఆయన చేసిన కొన్ని కామెడీ సినిమాలు ‘ఢీ’, దేనికైనా రెడీ’  ఒకటి రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.  ఇంతవరకు కెరీర్‌ను టర్న్‌ చేసే స్థాయి సూపర్‌ హిట్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో సినిమాల నుంచి లాంగ్‌ గ్యాప్ తీసుకున్న విష్ణు.. మోసగాళ్లు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక  విష్ణు ఈ సినిమాతో పాటు మరో సినిమాలోను నటిస్తున్నాడు. విష్ణు ప్రధాన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు 'భక్త కన్నప్ప'గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలోని నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. మరోవైపు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ 'అహం బ్రహ్మస్మి' అనే భారీ పాన్ ఇండియా మూవీని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kajal Aggarwal, Manchu Vishnu, Tollywood, Venkatesh

  ఉత్తమ కథలు