Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 4, 2019, 4:03 PM IST
వెంకీ మామ పోస్టర్స్
వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే కన్ఫ్యూజన్కు తెరదించుతూ డిసెంబర్ 13 అని అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు మీడియా మిత్రులు కూడా వచ్చారు. ఇదిలా ఉంటే ఇందులో తన కామెడీ టైమింగ్ మరోసారి చూపించాడు వెంకటేష్. స్టేజీపైకి ఎక్కీ ఎక్కగానే మైక్ పట్టుకుని నవ్వులు పూయించాడు విక్టరీ హీరో. దేవుడా.. మంచి దేవుడా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు నాయనా.. కొన్ని రోజులుగా నిద్ర కూడా రావడం లేదు ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని.. చివరికి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు.

వెంకీ మామ పోస్టర్స్
థ్యాంక్ యూ సురేష్ ప్రొడక్షన్స్.. థ్యాంక్ యూ సురేష్ బాబు అంటూ తన అన్నయ్యపైనే అదిరిపోయే సెటైర్ వేసాడు వెంకీ. బాబీ తెరకెక్కించిన వెంకీ మామాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా నటించడంతో ఆసక్తి బాగా పెరిగిపోయింది. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటే అప్పుడు పెద్ద సినిమాలున్నాయి.. దాంతో డిసెంబర్లోనే విడుదల చేయాలనుకున్నా కూడా రూలర్, ప్రతిరోజూ పండగే, డిస్కో రాజా లాంటి సినిమాలున్నాయి.
దాంతో ఎప్పుడు తీసుకురావాలా అనే కన్ఫ్యూజన్ నుంచి డిసెంబర్ 13న సోలో విడుదల తేదీ తీసుకున్నాడు సురేష్ బాబు. దాంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక వెంకీ మామ టీం కూడా దీనిపై చాలా ఖుషీగా ఉన్నారు. అందుకే స్టేజీపై అన్నయ్య సురేష్ బాబు థ్యాంక్స్ చెబుతూనే సెటైర్లు కూడా వేసాడు వెంకటేష్. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీత దర్శకుడు.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 4, 2019, 4:02 PM IST