వెంకటేష్ కొడుకు అర్జున్‌ను చూసారా.. హీరోలా ఉన్నాడే..?

Venkatesh son Arjun: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల వారసులంతా అందరికీ తెలుసు. గౌతమ్, అకిరా నందన్ లాంటి వాళ్లు బయట ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. మోక్షజ్ఞ కూడా అప్పుడప్పుడూ బయటకి వచ్చాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 3:12 PM IST
వెంకటేష్ కొడుకు అర్జున్‌ను చూసారా.. హీరోలా ఉన్నాడే..?
వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుబాటి (arjun daggubati)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోల వారసులంతా అందరికీ తెలుసు. గౌతమ్, అకిరా నందన్ లాంటి వాళ్లు బయట ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు. మోక్షజ్ఞ కూడా అప్పుడప్పుడూ బయటకి వచ్చాడు. కానీ వెంకటేష్ కొడుకు అర్జున్ మాత్రం ఎక్కువగా బయట కనిపించింది లేదు. అప్పుడెప్పుడో చిన్నపుడు నాన్నతో చేసిన ఫోటోషూట్.. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో ఆడియో వేడుకలో ఓ సారి కనిపించి మాయం అయ్యాడంతే. మళ్లీ ఇప్పటి వరకు ఈ కుర్రాడు ఎలా ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు. కొడుకుతో పాటు కూతుళ్లు ఆశ్రిత, హయవాహిని, భావన ఫోటోలు కూడా ఎక్కువగా కనిపించవు.
వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుబాటి (arjun daggubati)
వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుబాటి (arjun daggubati)


భార్య నీరజ కూడా చాలా తక్కువ సార్లు బయటికి వచ్చింది. ఇప్పుడు అంతా కలిసి ఒకేసారి కనిపించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాలా ఈవెంట్స్‌లలో దగ్గుబాటి అర్జున్ కనిపించాడు. ఇప్పుడు అన్నయ్య రానా రోకా వేడుకలో మరోసారి కనిపించాడు అర్జున్. రానా, మిహికా జంటకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో వాళ్ల ఫోటోలను షేర్ చేస్తున్నారు. అందులో అర్జున్ కూడా ఉన్నాడు. గతంలో అర్జున్‌ని చూసిన వాళ్లు ఇప్పుడు చూసి షాక్ అవుతున్నారు. ఐదేళ్లలోనే చాలా మారిపోయాడు ఈ కుర్రాడు.
వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుబాటి (arjun daggubati)
వెంకటేష్ కొడుకు అర్జున్ దగ్గుబాటి (arjun daggubati)

నూనూగు మీసాలు.. ఇప్పుడిప్పుడే వస్తున్న గడ్డంతో హ్యాండ్సమ్ లుక్‌తో పిచ్చెక్కిస్తున్నాడు అర్జున్. ఈ కుర్రాన్ని చూస్తుంటే మరో రెండు మూడేళ్లలోనే ఇండస్ట్రీకి వచ్చేలా కనిపిస్తున్నాడు. వెంకటేష్ మాత్రం కొడుకు చదువు అయిపోయిన తర్వాత కానీ సినిమాలు కాదంటున్నాడు. ఎందుకంటే ముందు స్టడీస్.. ఆ తర్వాతే సినిమాలు అనేది వెంకీ సిద్ధాంతం. తాను కూడా ఇదే చేసాడు.. ఇప్పుడు కొడుకు విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఏదేమైనా కూడా వెంకటేష్ కొడుకు లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading