అభిమానులకు ‘వెంకీ మామ’ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..

బాబీ తెరకెక్కించిన ‘వెంకీ మామ’ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను వెంకటేష్ బర్త్ డే అయిన డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 3, 2019, 12:59 PM IST
అభిమానులకు ‘వెంకీ మామ’ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..
‘వెంకీ మామ’ బర్త్ డే గిఫ్ట్ (Twitter/Photo)
  • Share this:
గత కొన్నేళ్లుగా వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. ఈ యేడాది ‘ఎఫ్ 2’ సినిమాతో వరుణ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. తాజాగా తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య.. జవాన్ పాత్రలో నటిస్తున్నాడు. జై జవాన్..జై కిసాన్ నేపథ్యంలో దర్శకుడు బాబీ (కే.యస్.రవీంద్ర) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిజ జీవితంలో మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. టైటిల్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ తెరకెక్కించిన ‘వెంకీ మామ’ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వెంకటేష్..నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఇపుడు పూర్తి స్థాయిలో వీళ్లిద్దరు కలిసి ఈ చిత్రంలో నటించారు.

victory venkatesh naga chaitanya latest movie venky mama release on december 13 on venkatesh birthday,venkatesh,venkaatesh birthday,venky mama,venky mama twitter,venky mama release date,venky mama release date on december 13,venky mama look,venky mama vinayaka chavithi poster,venkatesh naga chaitanya,naga chaitanya twitter,venky mama twitter,venky mama movie release date,telugu cinema,venky mama,venkatesh naga chaitanya movie,naga chaitanya,venky mama teaser,venky mama first look,venky mama trailer,venky mama movie,venky mama songs,venky mama first look teaser,venky mama movie teaser,venky mama release date,venky mama movie release date,venky mama movie updates,naga chaitanya movies,venky mama movie trailer,venky mama telugu movie,venky mama making,venkatesh,వెంకటేష్,నాగచైతన్య,వెంకీ మామా వినాయక చవితి పోస్టర్,తెలుగు సినిమా,వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్
డిసెంబర్ 13న విడుదల కానున్న ‘వెంకీ మామ’ (Twitter/Photo)


ముందుగా ఈ చిత్రాన్ని  సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనకున్నారు. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంలో డిసెంబర్‌ 20న రిలీజ్ చేయాలన్నారు.  ఆ డేట్‌లో కూడా మూడు సినిమాలు పోటీకి ఉండటంతో తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈ విషయాన్ని రానా, దర్శకుడు బాబీ కన్ఫామ్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసారు.




డిసెంబర్ 13 విషయానికొస్తే..  ఆరోజు విక్టరీ హీరో వెంకటేష్ పుట్టినరోజు. ఇప్పటి వరకు వెంకటేష్ నటించిన ఏ సినిమా ఆయన పుట్టిన  రోజు విడుదలైన దాఖలాలు లేవు. అందుకే డిసెంబర్ 13న వెంకీ మామ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి వెంకటేష్ తన పుట్టినరోజున తను యాక్ట్ చేస్తోన్న‘వెంకీ మామ’ విడుదల చేస్తూ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు.
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>