Home /News /movies /

VICTORY VENKATESH FAMILY ENTERTAINER VASANTHAM MOVIE COMPLETED 18 YEARS AND HERE THE FINAL COLLECTIONS PK

Vasantham @ 18 Years: వెంకటేష్ ‘వసంతం’ సినిమాకు 18 ఏళ్ళు.. ‘సింహాద్రి’ ప్రభంజనం తట్టుకుని..

వసంతం సినిమాకు 18 ఏళ్ళు (Vasantham movie)

వసంతం సినిమాకు 18 ఏళ్ళు (Vasantham movie)

Vasantham @ 18 Years: ఒక్క హిట్ వస్తే చాలురా బాబూ అనుకుంటున్న బయ్యర్లకు రెండు సూపర్ హిట్స్ లాభాల్లో ముంచేసాయి. తమిళ దర్శకుడు విక్రమన్ తెరకెక్కెంచిన వసంతం సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా వెంకటేష్‌ను(Venkatesh) నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది.

ఇంకా చదవండి ...
అది 2003.. సంక్రాంతికి ఒక్కడు సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత పెద్దగా విజయాలు రాలేదు. చూస్తుండగనే ఆర్నెళ్లు గడిచిపోయాయి. అప్పటికీ పెద్దగా విజయాలు రాలేదు. అలాంటి సమయంలో జులై నెల వచ్చింది. అప్పుడు వచ్చింది సింహాద్రి సినిమా. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. సరిగ్గా ఆ సినిమా వచ్చిన వారం రోజుల తర్వాత వసంతం రూపంలో మరో విజయం కూడా తెలుగు ఇండస్ట్రీని పలకరించింది. అప్పటి వరకు ఒక్క హిట్ వస్తే చాలురా బాబూ అనుకుంటున్న బయ్యర్లకు రెండు సూపర్ హిట్స్ లాభాల్లో ముంచేసాయి. తమిళ దర్శకుడు విక్రమన్ తెరకెక్కెంచిన వసంతం సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా వెంకటేష్‌ను నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కించింది. కుటుంబ ప్రేక్షకులకు వసంతం బాగా రీచ్ అయింది. ఆర్తి అగర్వాల్, కళ్యాణి ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటించారు. ఎస్ఏ రాజ్‌కుమార్ సంగీతం.. మంచి స్క్రీన్ ప్లేతో వసంతం సూపర్ హిట్ అయింది. సింహాద్రి ప్రభంజనం తట్టుకుని మరీ నిలబడింది. జులై 11, 2003న విడుదలైన వసంతం సినిమాకు నేటితో 18 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ చూద్దాం..

vasantham movie,venkatesh vasantham movie 18 years,venkatesh vasantham movie collections,venkatesh twitter,venkatesh vasantham movie 18 years completed,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ వసంతం సినిమాకు 18 ఏళ్ళు,వసంతం సినిమా కలెక్షన్స్
వసంతం సినిమాకు 18 ఏళ్ళు (Vasantham movie)


నైజాం: 5.22 కోట్లు
సీడెడ్: 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు
ఈస్ట్: 0.53 కోట్లు
వెస్ట్: 0.55 కోట్లు
గుంటూరు: 0.80 కోట్లు
కృష్ణా: 0.85 కోట్లు
నెల్లూరు: 0.33 కోట్లు

ఏపీ + తెలంగాణ: 10.89 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.47 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: 13.36 కోట్లు

[caption id="attachment_951004" align="alignnone" width="350"]vasantham movie,venkatesh vasantham movie 18 years,venkatesh vasantham movie collections,venkatesh twitter,venkatesh vasantham movie 18 years completed,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ వసంతం సినిమాకు 18 ఏళ్ళు,వసంతం సినిమా కలెక్షన్స్ వసంతం సినిమాకు 18 ఏళ్ళు (Vasantham movie)[/caption]

అప్పట్లో వెంకటేష్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. ఈ క్రమంలోనే 18 ఏళ్ళ కిందే ‘వసంతం’ చిత్రాన్ని 8.7 కోట్లకు అమ్మారు. ఈ సినిమా ఫుల్ రన్‌లో 13.36 కోట్ల షేర్ వసూలు చేసి బయ్యర్లకు మంచి లాభాలు తీసుకొచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero venkatesh, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు