సీనియర్ హీరోలకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది.. ఇమేజ్ ఉంది కానీ కుర్ర హీరోలతో పటీ పడి సినిమాలు చేసి విజయాలు సాధించడం మాత్రం సాధ్యం కావడం లేదు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం అంతగా సాధించడం లేదు. ఒకప్పుడు చూపించిన ఆ జోరు మాత్రం ఇప్పుడు వాళ్లలో కనిపించడం లేదు. ఎప్పుడో ఓసారి వచ్చే విజయాలే కానీ వరస విజయాలను మరిచిపోయి చాలా కాలమే అయిపోయింది. ఇలాంటి సమయంలో వెంకటేష్ రేర్ రికార్డు సాధించాడు. ఈయన హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు.
వరసగా మూడు విజయాలతో సీనియర్ హీరోల్లో ఈ మధ్య హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. వెంకీ మామ సినిమా మూడు వారాల్లో 72 కోట్ల గ్రాస్.. 35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్ర విజయంతో వెంకీ వరసగా మూడో విజయాన్ని పూర్తి చేసాడు. ఈ ఏడాది మొదట్లో ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈయన. అందులో వరుణ్ తేజ్‌తో కలిసి నటించాడు.
ఇప్పుడు నాగచైతన్యతో హిట్ కొట్టాడు. ఇక 2018ని ఖాళీగా వదిలేసిన ఈయన.. దానికి ముందు ఏడాది గురు సినిమాతో హిట్ కొట్టాడు. ఇలా వరసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు వెంకటేష్. ప్రస్తుతం అసురన్ రీమేక్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. దాని తర్వాత మరో మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టాడు విక్టరీ హీరో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood, Venkatesh