తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన వెంకటేష్.. తమ్ముడు, తోడల్లుడికి విక్టరీ హీరో సవాల్..

ప్రస్తుతం మన దేశం కరోనాపై పోరాడుతోంది. ఇప్పటికే మన దేశంలో వచ్చే నెల మూడు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. తాజాగా తారక్‌ ఛాలెంజ్‌కు వెంకటేష్ స్పందించారు. అంతేకాదు తన తోడల్లుడిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసారు.

news18-telugu
Updated: April 23, 2020, 12:58 PM IST
తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన వెంకటేష్.. తమ్ముడు, తోడల్లుడికి విక్టరీ హీరో సవాల్..
వెంకటేష్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశం కరోనాపై పోరాడుతోంది. ఇప్పటికే మన దేశంలో వచ్చే నెల మూడు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహాయిస్తే మిగతావన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. . లాక్‌డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటున్నారు. పైగా పనివాళ్లు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు.ఎపుడు ఇంట్లో వంటింటి ముఖం వైపు చూడని హీరో, హీరోయిన్లు, దర్శకులు ఇపుడు ఇంట్లో ఒక రోజు గిన్నెలు తోమి, ఇళ్లు తుడుస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి ప్రారంభించిన ‘బి ది రియల్ మేన్’  విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి.. ఇంటిపనులు చేయాలని ఎన్టీఆర్, రాజమౌళిని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ ఇంట్లో పనులు చేసి బాబాయి బాలయ్యకు, హీరో నాగార్జున, వెంకటేష్, చిరంజీవికి ఈ చాలెంజ్ విసిరారు.తాజాగా చిరంజీవి ఈ ఛాలెంజ్ స్వీకరించి ఇళ్లు తుడిచి తల్లికి దోష చేసి పెట్టారు. ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించాడు.

ఇళ్లు తుడిచి తోట పనిచేసి ఇంట్లో వంట చేసి పెట్టారు. అంతేకాదు బి ది రియల్ మేన్ చాలెంజ్‌ను తన వెండితెర తమ్ముడు మహేష్ బాబుకు నామినేట్ చేసాడు. మహేష్ బాబుతో పాటు  తనతో ఎఫ్2 సినిమాలో తోడల్లుడు సినిమాలో నటించిన వరుణ్ తేజ్‌‌కు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి  బీ ది రియల్ మేన్ చాలెంజ్‌కు నామినేట్ చేసారు. మొత్తానికి ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్‌కు అందరు మంచి రెస్సాన్సే వస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 23, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading