అర్ధరాత్రి స్టార్ హీరోయిన్ ఇంట్లోకి ముసుగు వేసుకుని దూరిన హీరో..

కత్రినా ఇంటి దగ్గర విక్కీ కౌశల్ (vicky kaushal katrina kaif)

Katrina Kaif Vicky Kaushal: టైటిల్ చూడగానే ఎవరబ్బా ఆ హీరో హీరోయిన్ అనే అనుమానాలు కామన్‌గానే వస్తుంటాయి. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఓ హీరో నిజంగానే ముసుగు వేసుకుని..

  • Share this:
టైటిల్ చూడగానే ఎవరబ్బా ఆ హీరో హీరోయిన్ అనే అనుమానాలు కామన్‌గానే వస్తుంటాయి. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఓ హీరో నిజంగానే ముసుగు వేసుకుని స్టార్ హీరోయిన్ ఇంట్లోకి రాత్రి పూట వచ్చాడు. ఈ ఫోటోలు కాస్తా ఎవరి కంట్లో అయితే పడకూడదో వాళ్ల కంట్లోనే పడ్డాయి. అదే మీడియా కెమెరా కళ్లలో పడిపోయాయి. దాంతో వెంటనే సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చేసాయి. ఆ హీరో హీరోయిన్ ఎవరో కాదు కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్.
కత్రినా ఇంటి దగ్గర విక్కీ కౌశల్ (vicky kaushal katrina kaif)
కత్రినా ఇంటి దగ్గర విక్కీ కౌశల్ (vicky kaushal katrina kaif)

ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఒకానొక టైమ్‌లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన విక్కీ.. తాను సింగిల్ అంటూ అప్పట్లో క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పటికీ ఈయన కత్రినాతో మింగిల్ అవుతూనే ఉన్నాడని తెలుస్తుంది. తమ వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలపై ఎవరీకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు ఈయన. ఈ విషయాన్ని వాళ్లు ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా కూడా బయటికి వస్తూనే ఉంది.
కత్రినా ఇంటి దగ్గర విక్కీ కౌశల్ (vicky kaushal katrina kaif)
కత్రినా ఇంటి దగ్గర విక్కీ కౌశల్ (vicky kaushal katrina kaif)

ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ముంబై లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. అలాంటి సమయంలో ఆగస్ట్ 9 రాత్రి కత్రినా ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యాడు విక్కీ కౌశల్. తలకు క్యాప్‌.. ముఖానికి మాస్క్.. చేతులకు గ్లౌ ధరించి పక్కాగా దిగిపోయాడు. ఎవరి కంటా పడకుండా హడావిడిగా కారు దిగి లోపలికి వెళ్లిపోయాడు. అలాంటి సమయంలోనే కెమెరా కంటికి చిక్కాడు విక్కీ కౌశల్. దాంతో ఇద్దరి మధ్య నిజంగానే ఏదో జరుగుతుందనే వాదనకు మరింత బలం చేకూరినట్లైంది.
Published by:Praveen Kumar Vadla
First published: