కత్రినా కైఫ్‌తో డేటింగ్ నిజమేనా? క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ హీరో

Katrina Kaif Affair | కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మధ్య అఫైర్ నడుస్తున్నట్లు కొన్ని మాసాలుగానే బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి అఫైర్‌పై జరుగుతున్న ప్రచారానికి బలమైన కారణం లేకపోలేదు.

news18-telugu
Updated: February 9, 2020, 11:09 AM IST
కత్రినా కైఫ్‌తో డేటింగ్ నిజమేనా? క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ హీరో
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్
  • Share this:
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌తో నటుడు విక్కీ కౌశల్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తోందని, 2020లోనే వారిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగానే బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి అఫైర్‌పై బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బలమైన కారణాలు లేకపోలేదు. బాలీవుడ్ సెలబ్రిటీల ప్రైవేటు పార్టీలు, పబ్లిక్ ఈవెంట్స్‌లో వారిద్దరూ కలిసే పాల్గొంటున్నారు. అయితే ఎట్లకేలకు ఈ పుకార్లపై విక్కీ కౌశల్ మౌనంవీడాడు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు. కత్రినా కైఫ్‌తో అలాంటి స్టోరీ ఏమీ లేదన్నాడు. పర్సనల్ లైఫ్ విషయంలో తాను ఓపన్‌గా ఉంటానని, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశాడు.

విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్


విక్కీ కౌశల్‌తో అఫైర్ పుకార్లపై గతంలోనే కత్రినా కైఫ్ వివరణ ఇచ్చింది. పుకార్లు రావడం జీవితంలో సహజమేనని పేర్కొంది. పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరంలేని పరిపక్వత తనకు ఉందని చెప్పుకొచ్చింది. తమ గురించి పుకార్ల రావడం కొందరికి నచ్చదని, అయితే నటిగా ఇలాంటి పుకార్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. సెలబ్రిటీల విషయంలో వచ్చే పుకార్లలో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు ఉంటాయని పేర్కొంది. మల్లీశ్వరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచమైన కత్రినా కైఫ్...బాలీవుడ్‌లో చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది.

First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు