హీరో దవడ పగిలింది.. 13 కుట్లు పడ్డాయి..

విక్కీ కౌశల్ (Vicky Kaushal)

యురి.. ది సర్జికల్ స్ట్రైక్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీ. ఈ సినిమాతో భారీ విజయం అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న బాలీవుడ్ మీరో విక్కీ కౌశల్‌కి షూటింగ్ గాయం అయింది.

  • Share this:
    బాలీవుడ్ లేటెస్ట్ మూవీ యురి.. ది సర్జికల్ స్ట్రైక్ ఎంత బాగా ఆడిందో అందరికీ తెలుసు. ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో విక్కీ కౌశల్.. లేటెస్ట్‌గా ‘ఉధమ్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు భాను ప్రతాప్ సింగ్ డైరెక్షన్‌లో గుజరాత్ అనే మరో హారర్ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా.. ఓ భారీ డోర్ విక్కీపై పడిందట. దీంతో.. అతని దవడ ఎముక విరిగింది. వెంటనే విక్కీని ఫస్ట్ ఎయిడ్ కోసం ఓ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే, గాయం ఎక్కువగానే కావడంతో 13 కుట్లు పడ్డట్లు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

    గుజరాత్ మూవీలో భూమి పడ్నేకర్ హీరోయిన్‌ గా చేస్తోంది. విక్కీ కౌశల్ తక్త్ అనే చిత్రంలో ఔరంగజేబు పాత్ర పోషించాడు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ‘ఉధమ్ సింగ్’ మూవీ 2020లో సందడి చేయనుంది. ఇందులో విక్కీ కౌశల్ స్వాతంత్రోద్యమకారుడు ఉధమ్ సింగ్ పాత్ర పోషించనున్నాడు. విక్కీ డోనార్, పింక్, అక్టోబర్, పికు మూవీ డైరెక్టర్ సూజిత్ సర్కార్ ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు.
    First published: