హోమ్ /వార్తలు /సినిమా /

SP Balasubrahmanyam : బాలు ఆరోగ్యంపై ఉప రాష్ట్రపతి ఆరా..

SP Balasubrahmanyam : బాలు ఆరోగ్యంపై ఉప రాష్ట్రపతి ఆరా..

5. ఎస్పీ బాలసుబ్రమణ్యం: 53 ఏళ్ల పాటు పాటలు పాడి అలరించిన దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా 2001లో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన దాదాపు 40 వేల పాటలు పాడారు.

5. ఎస్పీ బాలసుబ్రమణ్యం: 53 ఏళ్ల పాటు పాటలు పాడి అలరించిన దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా 2001లో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన దాదాపు 40 వేల పాటలు పాడారు.

SP Balasubrahmanyam : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

  పాపులర్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలు చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రికి ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆరోగ్యం విషమంగానే ఉందని.. సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాలు ఆరోగ్యం విషయంలో అవసరం అనుకుంటే నిపుణులను సంప్రదించాలని వెంకయ్యనాయుడు వైద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. కరోనా బారినపడిన బాలు ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్య ఉండడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

  కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్‌ కేర్‌లో చేరిన బాలుకు.. ఎక్మో, వెంటిలేటర్‌ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇక ఇటీవల బాలుకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో ఆయన అభిమానులు.. శ్రేయోభిలాషులు సంతోష పడ్డారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఆసుపత్రి విడుదల చేసిన తాజా బులెటిన్‌ నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు కమలహాసన్ వెంటనే బాలు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు