విజయ నిర్మల మృతిపై ఉప రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖుల నివాళులు..

నటిగా,దర్శకురాలిగా,నిర్మాతగా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన విజయ నిర్మల గుండెపోటుతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.ఆమె మృతి పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసాడు. మరోవైపు చిరంజీవి,బాలకృష్ణ కూడా విజయ నిర్మల మృతి పై సంతాపం వ్యక్తం చేసారు.

news18-telugu
Updated: June 27, 2019, 1:59 PM IST
విజయ నిర్మల మృతిపై ఉప రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖుల నివాళులు..
విజయ నిర్మల మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • Share this:
నటిగా,దర్శకురాలిగా,నిర్మాతగా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసిన విజయ నిర్మల గుండెపోటుతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. విజయ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం  ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయ నిర్మల ప్రగాఢ సానుభూతి తెలియ పరిచారు. బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించి ఉన్నత శిఖరాలు అధిరోహించారని గుర్తు చేసుకున్నారు.

ఇంకోవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విజయ నిర్మల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో భానుమతి తర్వాత ఆ స్థాయిలో గర్వించదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల అని ఆయన కొనియాడారు. ఆమె లేని లోటు యావత్ తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు.మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా విజయ నిర్మల మృతిపై విచారం వ్యక్తం చేసారు. అంతేకాదు తన నటించిన ‘పాండురంగ మహత్యం’ సినిమాతో విజయ నిర్మల నటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తన తండ్రి ఎన్టీఆర్‌తో ‘మారిన మనిషి’,‘పెత్తందార్లు’,నిండు దంపతులు’, ‘విచిత్ర కుకటుంబం’,‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాల్లో నటించినట్టు చెప్పారు. అంతేకాదు. దర్శకురాలిగా 44 సినిమాలను డైరెక్ట్ చేయడం మాములు విషయం కాదన్నారు. మరో సీనియర్ హీరోలైన కృష్ణం రాజు, మురళి మోహన్ కూడా విజయ నిర్మల మృతి పట్ట తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్త పరిచారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా విజయ నిర్మల మృతి తీవ్ర సానుభూతి వ్యక్తం ఒక లెటర్ విడుదల చేసారు. ఇంకోవైపు హీరో జూ.ఎన్టీఆర్ కూడా విజయ నిర్మల మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. రామ్ చరణ్, సమంత,నాని, రానా, కాజల్ అగర్వాల్ వంటి వాళ్లు కూడా విజయ నిర్మల మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. దిగ్గజ దర్శకురాలైన విజయ నిర్మల ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు తనకు తల్లి వరస అయ్యే విజయ నిర్మలకు మహేష్ బాబు సహా ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. దీంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు కూడా విజయ నిర్మల మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. రేపు విజయ నిర్మల అంత్యక్రియలు ..చిలుకూరి దగ్గర ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 27, 2019, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading