Kamal Haasan - Vijay Sethupati: ఆ విషయంలో కమల్ తర్వాత విజయ్ సేతుపతే..

Viajy Sethupati following Kamal Haasan in acting carrer

Kamal Haasan - Vijay Sethupati: కమల్ హాసన్ తర్వాత వివిధ భాషల్లో నటించిన ఏకైక నటుడు విజయ్ సేతుపతి. తమిళ్‌తో పాటు మలయాళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు.

  • Share this:
    విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పేదేముంది? ఇండియన్ సినీ చరిత్రలోనే చాలా బిజీగా ఉండే నటుడెవరైనా ఉన్నారంటే అది విజయ్ సేతుపతియే అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఒక డజను సినిమాలు, వెబ్ షోస్ ఉన్నాయి. ఏమాత్రం బ్రేక్ లేకుండా కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. లాక్‌డౌన్ సమయంలోనూ విజయ్ సేతుపతి బిజీగానే ఉన్నాడు. కమల్ హాసన్ తర్వాత వివిధ భాషల్లో నటించిన ఏకైక నటుడు విజయ్ సేతుపతి. తమిళ్‌తో పాటు మలయాళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు.

    తన జీవిత కాలంలో నేర్చుకోగలిగినంత తాను నేర్చుకోవాలనుకుంటున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. చాలా మంది తనకు హిందీ రాదనుకుంటారని.. కానీ తాను హిందీని అర్థం చేసుకోవడంతో పాటు కొంత వరకూ మాట్లాడగలనని విజయ్ సేతుపతి వెల్లడించారు. అయితే ఇటీవలి కాలంలో తాను హిందీలో పెద్దగా మాట్లాడకపోవడంతో తాను టచ్ కోల్పోయానని చెప్పారు. తాను ‘ఉప్పెన’ సినిమా చేస్తున్న సమయంలో తనకు తెలుగు అసలు రాదని.. కానీ తాను తెలుగు మాట్లాడటానికి యత్నించానని వెల్లడించాడు. ఏదైనా భాష మాట్లాడాలి అంటే ముందుగా దానిని అర్థం చేసుకోవాలని విజయ్ సేతుపతి వెల్లడించాడు.

    సినిమా ఒక మేజిక్ వంటిదని... తాను ఈ పరిశ్రమలో కొంతకాలంగా ఉన్నానని.. కానీ తన సినిమాల విజయాలను, వైఫల్యాలను తాను నిర్ణయించలేనని తెలిపారు. ఒక సినిమా బాక్సాఫీస్ పనితీరును నిర్ధారించడానికి ఎవరూ సమర్థులు కాదని తాను భావిస్తానన్నారు. తాను మాస్టర్‌పై సంతకం చేసినప్పుడు, విలన్‌గా నటించడానికి అంగీకరించక తప్పదని, అది తన స్టార్‌ స్టేటస్‌ని ప్రభావితం చేస్తుందని చాలా తనను నిరుత్సాహపరిచారన్నారు. కానీ తాను ఆ మాటలను విశ్వసించలేదని విజయ్ సేతుపతి వెల్లడించారు. ప్రధానంగా లోకేష్, విజయ్ సర్ తన పాత్రను ఆసక్తికరంగా మార్చడానికి తానూ కొంచెం సహకరించానన్నారు. ప్రేక్షకులు తన డైలాగ్స్ కారణంగా విసుగు ఫీలవకుండా ఉండేలా చూసుకుంటునన్నారు. దీని కోసం తన స్క్రిప్టుతో పాటు పాత్రను సైతం అర్థం చేసుకుంటానని విజయ్ సేతుపతి వెల్లడించారు.
    Published by:Anil
    First published: