Home /News /movies /

Shabaash Mithu release date: మిథాలీ రాజ్ బయోపిక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. చిరంజీవి ‘ఆచార్య’తో పోటీ..

Shabaash Mithu release date: మిథాలీ రాజ్ బయోపిక్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. చిరంజీవి ‘ఆచార్య’తో పోటీ..

శభాష్ మిథు రిలీజ్ డేట్ (Shabaash Mithu release date)

శభాష్ మిథు రిలీజ్ డేట్ (Shabaash Mithu release date)

Shabaash Mithu release date: ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లేడీ సచిన్ అంటూ ముద్దుగా అభిమానులు ఈమెను పిలుచుకుంటారు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలకు పెట్టింది పేరు మిథాలీ (Shabaash Mithu release date). తాజాగా ఈమె బయోపిక్ వస్తుంది.

ఇంకా చదవండి ...
ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లేడీ సచిన్ అంటూ ముద్దుగా అభిమానులు ఈమెను పిలుచుకుంటారు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలకు పెట్టింది పేరు మిథాలీ. ఉమెన్ టీమ్‌లో చాలా రికార్డులు మిథాలీ పేరు మీదున్నాయి. డిసెంబర్ 3న ఈమె పుట్టినరోజు. ఆ సందర్భంగా వయాకామ్ 18 స్టూడియోస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈమె బయోపిక్ శభాష్ మిథు విడుదల తేదీని సోషల్ మీడియాలో షేర్ చేసారు. మన దేశంలో సినిమా, క్రికెట్ రెండు అతిపెద్ద ప్రభావశీలులు. మన జీవితంలో అవి కూడా భాగం అయిపోయాయి. అలాంటిది స్పోర్ట్స్, సినిమా కలిపితే వచ్చే మజానే వేరు. భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్ లాంటి జాతీయ అవార్డులు సాధించిన సినిమాల వెనక ఉన్న వయాకమ్ 18 టీం ఇప్పుడు మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇండియా మహిళల ODI కెప్టెన్ - దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితంపై చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

మిథాలీ పుట్టినరోజును పురస్కరించుకుని వయాకామ్ 18 స్టూడియోస్ శభాష్ మిథు విడుదల తేదీని ప్రకటించింది. తాప్సీ పన్ను నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య కూడా విడుదల కానుంది. శభాష్ మిథు అనేది ఎంతోమంది ఆడపిల్లలకు స్పూర్థిగా నిలుస్తుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. రాబోయే తరాలకు ఇది మార్గదర్శకంగా ఉంటుందని వాళ్లు చెప్తున్నారు.

Highest 1st day shares 2021: ‘అఖండ’, ‘వకీల్ సాబ్’ సహా.. 2021లో టాలీవుడ్ సినిమాల ఫస్ట్ డే షేర్స్ ఇవే..


ఈ చిత్రం మిథాలీ జీవితంలోని హెచ్చు తగ్గులతో పాటు ఎదురుదెబ్బలు, ఆనంద క్షణాలను వివరిస్తుందని మేకర్స్ తెలిపారు. తాప్సీ పన్ను టైటిల్ రోల్ పోషిస్తుంది. ఈ కారెక్టర్ కోసం తాప్సీ బాగానే కష్టపడింది. ఇందులో నటుడు విజయ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. శభాష్ మిథు మిథాలీ రాజ్ ఐకానిక్ జర్నీకి ప్రతిరూపం. ఈ సినిమా ఇంటర్నేషనల్ వేదికపై కూడా విడుదల కానుంది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తున్న శభాష్ మిథు సినిమాను శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bollywood, Hindi Cinema, Mithali Raj

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు