హోమ్ /వార్తలు /సినిమా /

Dadasaheb Phalke Award: ఒకప్పటి బాలీవుడ్ నటి ఆషా పరేఖ్‌కు సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రధానం..

Dadasaheb Phalke Award: ఒకప్పటి బాలీవుడ్ నటి ఆషా పరేఖ్‌కు సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రధానం..

బాలీవుడ్ సీనియర్ నటి ఆషా పరేఖ్‌కు సినీ అత్యున్నత పురస్కారం (Twitter/Photo)

బాలీవుడ్ సీనియర్ నటి ఆషా పరేఖ్‌కు సినీ అత్యున్నత పురస్కారం (Twitter/Photo)

Asha Parekh Receivs Dadasaheb Phalke Award:  బాలీవుడ్‌లో ఒకప్పటి తరాన్ని తన అందం, అభినయంతో అలరించిన నటి ఆషా పరేఖ్‌కు అరుదైన గౌరవం దక్కింది.  కేంద్ర ప్రభుత్వం  ప్రభుత్వం 2020 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Asha Parekh Receivs Dadasaheb Phalke Award:  బాలీవుడ్‌లో ఒకప్పటి తరాన్ని తన అందం, అభినయంతో అలరించిన నటి ఆషా పరేఖ్‌కు అరుదైన గౌరవం దక్కింది.  కేంద్ర ప్రభుత్వం  ప్రభుత్వం 2020 యేడాదికి గాను సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.  గత ఆరేడు దశాబ్దాలుగా ఈమె సినీ పరిశ్రమకు చేసిన గుర్తింపుగా కేంద్రం ఆశా పరేఖ్‌కు ఈ అవార్డకు ఎంపిక చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను కేంద్రం ఆమెను ఎంపిక చేసింది. 10 యేళ్ల వయసులో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తర్వాత తన నటనతో బాలీవుడ్‌లో ఒక తరాన్ని ఉర్రూతలూగించింది. చిన్నపుడు ఆమె నృత్యం చేసిన ముచ్చట పడిన బిమల్ రాయ్.. ‘మా’ (1952)లో ఆమెకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత స్కూల్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత నాజీర్ హుస్సేన్ ‘దిల్ దేఖే దేఖో’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆ తర్వాత ఆషా పరేఖ్.. నాజీర్ హుస్నేన్ తెరకెక్కించిన ఆరు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.  ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’. ఫిర్ ఓ హి దిన్ లయా హూన్, కార్వాన్, తీస్రీ మంజిల్, ప్యాక్ కా మౌసమ్’ వంటి చిత్రాలతో ఈమె వెనుదిరిగి చూసుకోలేదు.

బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన వాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. హిందీలో అలాంటి నటీమణుల్లో ఆషా పరేఖ్ ఒకరు. ఈమె 1942 అక్టోబర్ 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టినరోజుకు కొన్ని రోజులు ముందు ఈ అవార్డు రావడం ఆమెకు పుట్టినరోజు కానుకగా అనే చెప్పొచ్చు. ఈమె తన మాతృభాష గుజరాతితో పాటు  పాటు పంజాబీ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించింది. 1992లో కేంద్రం ఈమెను పద్మశ్రీతో  గౌరవించింది. 79 యేళ్ల ఈ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అవివాహితగా ఉండిపోయింది.

1966లో వచ్చిన ‘దో బదన్’ చిత్రంలో తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అమితాబ్ బచ్చన్ ‘కాలియా’ చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించింది. ఆ తర్వాత నటనకు దూరంగా ఉన్నారు.

ఇక నటిగా కెరీర్ ఊపు మీదున్న సమయంలో ఆమెను పెళ్లి చేసుకుంటామని పలువరు ఆమె వెంట పడ్డారు. ముఖ్యంగా నటిగా ఆమె జీవతాన్ని మార్చేసిన నాజీర్ హుస్సేన్‌ను ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డారు. అప్పటికే అతనికీ వివాహాం కావడంతో అతనితోొ పెళ్లికి ఓకే చెప్పలేకపోయింది. 1998 నుంచి 2001 వరకు ఈమె సెన్సార్ బోర్ట్ తొలి చైర్ పర్సన్‌గా పనిచేశారు. అప్పట్లో సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా శేఖర్ కపూర్ నిర్మించిన ‘ఎలిజిబిత్’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టారు. 1995లో నటనకు గుడ్ బై చెప్పారు ఆషా పరేఖ్. అంతకు ముందు ఈమె జ్యోతి సీరియల్‌కు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌ను నిర్మించారు.

Ponniyin Selvan: బాహుబలి లెవల్లో మణిరత్నం ’పొన్నియన్ సెల్వన్’.. అభిమానులను ఆకట్టుకునే పాత్రలు ఇవే..

ఆశా పరేక్ 95 చిత్రాల్లో నటించారు. సెప్టెంబర్ 30న జరిగే జాతీయ చలన చిత్ర అవార్డుల భాగంగా ఈమెకు ఈ అవార్డు ప్రధానం చేయనున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలియజేసారు. ఉదిత్ నారాయణ్, హేమా మాలిని, ఆశా బోంస్లే, పూనమ్ ధిల్లాన్, టీఎస్ నాగభరణతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ ఆషా పరేఖ్ పేరును ప్రతిపాదించారు.  ఈ అవార్డులు 17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 51 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న 52వ వ్యక్తి ఆషా పరేఖ్. ఈమె కంటే ముందు తొలి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దేవికా రాణి (1969)సులోచనగా ఫేమసైన రూబీ మేయర్స్ (1973) బెంగాలీ భాషలో నటించిన తొలి హీరోయిన్ కానన్ దేవి (1976),తొలి మరాఠీ టాకీ ‘అయోధ్యాచ రాజా’లో హీరోయిన్‌గా నటించిన దుర్గాఖోటే (1983) తర్వాత ఈ అవార్డు అందుకున్న  హీరోయిన్‌గా ఆషా పరేఖ్ (2020) నిలిచారు. అటు సింగర్స్‌ లలో లతా మంగేష్కర్ (1989), ఆషా బోంస్లే (2000)లలో ఈ అవార్డు అందుకున్నారు. ఓవరాల్‌గా 20 యేళ్ల ఈ అవార్డు అందుకున్న ఏడో మహిళ ఆషా పరేఖ్ కావడం విశేషం. హీరోయిన్స్‌లో ఐదో మహిళ కావడం మరో ప్రత్యేకత.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Asha Parekh, Bollywood news, Dadasaheb Phalke Award, Tollywood

ఉత్తమ కథలు