Home /News /movies /

VETERAN TOLLYWOOD ACTOR KAIKALA SATYANARAYANA IN CRITICAL CONDITION AT HYDERABAD HOSPITAL MKS

Kaikala Satyanarayana : నటుడు కైకాల పరిస్థితి విషమం -అపోలో ఐసీయూలో వెంటిలేటర్‌పై..

కైకాల సత్యనారాయణ (పాత ఫొటో)

కైకాల సత్యనారాయణ (పాత ఫొటో)

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

ఇంకా చదవండి ...
నవరస నటనా సార్వభౌముడిగా పేరుపొందిన ప్రముఖ టాలీవుడ్ (tollywood) నటుడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ కుటుంసభ్యులకు ఫోన్‌ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల క్షేమంగా తిరిగి రావాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత నెల 30న కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంట్లో జారిపడటంతో కుటుంబసభ్యులు అప్పుడు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

భువనేశ్వరి ఉదంతంలో సంచలనం -జగన్ సేనకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ -వంశీ, నాని పేర్లు చెప్పకుండానే..



నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ తమ్మినేని చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..!!



1959 లో సిపాయి కూతురు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Kaikala Satyanarayanam, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు