Home /News /movies /

Kaikala Satyanarayana : మరింత విషమించిన కైకాల ఆరోగ్యం -పని చేయని అవయవాలు -డాక్టర్లు ఏమన్నారంటే

Kaikala Satyanarayana : మరింత విషమించిన కైకాల ఆరోగ్యం -పని చేయని అవయవాలు -డాక్టర్లు ఏమన్నారంటే

కైకాల సత్యనారాయణ(పాత ఫొటో)

కైకాల సత్యనారాయణ(పాత ఫొటో)

సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో గంటగంటకూ పరిస్థితి జఠిలంగా మారుతున్నది. కైకాలకు పలు అవయవాలు పని చేయడంలేదని, చికిత్సలో ఆశించిన స్పందన రావడంలేదని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు..

ఇంకా చదవండి ...
Kaikala Satyanarayana: భారతీయ సినీ పరిశ్రమలో ఎవరికీ దక్కని ‘నవరసన నటనా సార్వభౌమ’బిరుదు పొందిన టాలీవుడ్ ( tollywood ) సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో గంటగంటకూ పరిస్థితి జఠిలంగా మారుతున్నది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకల.. శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఆయనను హైదరాబాద్ (Hyderabad)  జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. కైకాల సత్య నారాయణ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్లను అపోలో యాజమాన్యం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నది. మెనేజ్ మెంట్.

వృద్ధాప్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న కైకాల సత్యనారాయణ గత నెల 30న ఇంట్లో జారిపడటంతో సమస్యలు మరింత పెద్దవయ్యాయి. అప్పట్లో కొన్ని రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన డిశ్చార్జి తర్వాత క్రమంగా కోలుకుంటున్నట్లే అనిపించినా, మళ్లీ ఆయనకు అవయవాలు పనిచేయకపోవడం, జ్వరం లాంటి సమస్యలు తలెత్తాయి. దీంతో మళ్లీ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

Hyderabad : అమ్మమ్మతో అక్రమ సంబంధం.. 11 ఏళ్ల మనవరాలిపై అత్యాచారం -80ఏళ్ల వృద్దుడి అఘాయిత్యంఅపోలో వైద్యులు శనివారం రాత్రి ప్రకటించిన బులిటెన్ ప్రకారం.. ‘కైకాల సత్యనారాయణ ఈ రోజు(శనివారం) ఉద‌యం 7.30 నిమిషాల‌కు జ్వరంతో అపోలోలో చేరారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ‌డం వ‌ల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. కోవిడ్ తర్వాత ఆయ‌న‌ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్ర‌స్తుతం కైకాల వెంటిలెట‌ర్ పై చికిత్స పొందుతున్నారు. కానీ.. ఆశించిన మేర‌కు స్పందించడం లేదు’అని వైద్యులు పేర్కొన్నారు.

భువనేశ్వరి ఉదంతంలో సంచలనం -జగన్ సేనకు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ -వంశీ, నాని పేర్లు చెప్పకుండానే..


కైకాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. ఆయ‌న అభిమానులు క్షేమంగా తిరిగి రావాలంటూ పూజ‌లు చేస్తున్నారు. కైకాల సత్యనారాయణ 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో వెండి తెర‌పై అడుగుపెట్టారు. ఆయ‌న హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఎన్నో పాత్ర‌ల్లో న‌టించారు. ఆయ‌న ఏ పాత్ర‌లో న‌టించినా.. ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి.. ఆ పాత్రకు జీవం పోసేవాడు.

Hyderabad : హీరోయిన్‌పై అత్యాచారం.. లైట్‌బాయ్ బాబు పన్నాగమిదే -shalu chourasiya కేసులో షాకింగ్ ట్విస్ట్


గత 60 ఏళ్లుగా తెలుగు సినీ రంగంలో దాదాపు 800 పైగా చిత్రాల్లో న‌టించారు కైకాల. చివ‌రిగా 2019లో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ మొదలవడంతో ఆయన బయటకు రాలేదు. అయితే అప్పటి నుంచి కూడా అయన ఇంటి పట్టునే ఉంటున్నారు.

మీ నగరం నుండి (​హైదరాబాద్)

రాష్ట్రం ఎంచుకోండి
​హైదరాబాద్
రాష్ట్రం ఎంచుకోండి
​హైదరాబాద్
Published by:Madhu Kota
First published:

Tags: Health, Hyderabad, Kaikala Satyanarayanam, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు