సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ సింగర్ మృతి చెందారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమా పాటలు పాడిన గాయని సంగీత సజిత్ ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురంలో మృతిచెందారు. సంగీత సజిత్ వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. సంగీత గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె అందుకు చికిత్స పొందుతోంది.
ఈ క్రమంలో ఆమె తిరువనంతపురంలోని తన సోదరి నివాసంలో మరణించారు. సంగీత వివిధ దక్షిణ భారత భాషల్లో 200 పాటలు పాడారు. సంగీత కెరీర్ ప్రారంభంలో మిస్టర్ రోమియో చిత్రంలో AR రెహమాన్ స్వరపరచిన "తన్నెరై కదలిక్కుం" పాట సూపర్‌హిట్ అయింది. పృథ్వీరాజ్ నటించిన 'కురుతి' చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్ ఆమె చివరి పాట.
ఆదివారం సాయంత్రం తిరువనంతపురంలోని థైకాడ్‌లోని శాంతికవాదం పబ్లిక్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత మరణ వార్త తెలుసుకున్న సౌత్ సినిమాకు చెందిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. మంచి గాయినిని సినిమా ఇండస్ట్రీ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు సినీ ప్రముఖులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood Cinema, Tolllywood