సినీ సంగీత దిగ్గజం కన్నుమూత.. శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ..

Mohammed Zahur Khayyam : జాహుర్ మృతిపై పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. 'కబీ కబీ'(1977) సినిమాతో పాటు 'ఉమ్‌రావ్ జాన్'(1982) సినిమాకు గాను ఆయన ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ప్రకటించింది.

news18-telugu
Updated: August 20, 2019, 6:54 AM IST
సినీ సంగీత దిగ్గజం కన్నుమూత.. శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ..
మహమ్మద్ జాహుర్ ఖయ్యం
  • Share this:
భారతీయ సినీ సంగీత దిగ్గజం మహమ్మద్ జాహుర్ ఖయ్యం(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జాహుర్ మృతితో బాలీవుడ్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. జాహుర్ మృతిపై పలువురు నటీనటులు సంతాపం ప్రకటించారు. 'కబీ కబీ'(1977) సినిమాతో పాటు 'ఉమ్‌రావ్ జాన్'(1982) సినిమాకు గాను ఆయన ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. 2011లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ప్రకటించింది. అలనాటి పంజాబీ సంగీత దర్శకుడు బాబా చిష్టి వద్ద అసిస్టెంట్‌గా చేరిన ఖయ్యం.. ఆ తర్వాత కాలంలో సంగీత దర్శకుడిగా మారారు. 1948లో వచ్చిన హీర్ రాంఝా సినిమాతో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన సంగీతం అందించిన పలు సినిమాలకు దిగ్గజ గాయకులు మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ గాత్రం అందించారు. రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్లకు ఖయ్యం అద్భుతమైన హిట్ పాటలు ఇచ్చారు. చివరిసారిగా 2016లో వచ్చిన గులాం బంధు సినిమాకు ఆయన సంగీతం అందించారు.ఖయ్యం మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఖయ్యం అందించిన మరుపురాని పాటలను ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. ఆయన మృతి తీవ్ర విచారకరం అన్నారు.


First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు