Home /News /movies /

ప్రముఖ కన్నడ సినీ నటి కన్నమూత.. శోక సంద్రంలో శాండల్‌వుడ్..

ప్రముఖ కన్నడ సినీ నటి కన్నమూత.. శోక సంద్రంలో శాండల్‌వుడ్..

సీనియర్ కన్నడ నటి శాంతమ్మ కన్నుమూత (Twitter/Photo)

సీనియర్ కన్నడ నటి శాంతమ్మ కన్నుమూత (Twitter/Photo)

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు చిత్ర సీమకు చెందిన దిగ్గజ నటులు కన్నుమూసారు. నిన్న అర్ధరాత్రి ప్రముఖ కన్నడ నటి కన్నుమూయడంతో శాండల్‌వుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు చిత్ర సీమకు చెందిన దిగ్గజ నటులు కన్నుమూసారు. నిన్నటి నిన్న దర్శకుడు రజత్ ముఖర్జీతో పాటు హులివానా గంగాధరయ్య. ఈ విషాద ఘటనలు మరవక ముందే కన్నడలో ఎన్నో సినిమాల్లో తల్లి, అమ్మమ్మ, నానమ్మ పాత్రలతో అలరించిన సీనియర్ నటి శాంతమ్మ (94) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈమె కన్నడ చిత్రసీమలో దాదాపు 200 పైగా చిత్రాల్లో వివిధ హీరోలకు తల్లి, నానమ్మ పాత్రలతో నటించి మెప్పించారు. వయసు మీద పడటంతో శాంతమ్మ కన్నుమూసారని ఆమె సన్నిహితులు తెలిపారు. మైసూర్‌లో ఉండే శాంతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మార్చి నెలలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. ఆమె పార్ధివ దేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్ రావాల్సి ఉంది. 50వ దశకం నుంచి పలు కన్నడ చిత్రాల్లో నటించిన శాంతమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె మృతితో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పై కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kannada Cinema, Sandalwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు