ప్రభాస్ తల్లి పాత్రలో ఒకప్పటి సల్మాన్ ఖాన్ హీరోయిన్...

‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది.ఈ సినిమాలో ఒకప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన హీరోయిన్‌ను ప్రభాస్ తల్లి పాత్రలో నటించనుంది.

news18-telugu
Updated: January 23, 2020, 7:10 AM IST
ప్రభాస్ తల్లి పాత్రలో ఒకప్పటి సల్మాన్ ఖాన్ హీరోయిన్...
సల్మాన్ ఖాన్, ప్రభాస్ (Facebook/Photo)
  • Share this:
‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను 1970-80 కాలం నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉందట. ఈ పాత్ర కోసం ఒకప్పటి హీరయిన్‌ భాగ్యశ్రీను అనుకుంటున్నారు. అప్పట్లో సల్మాన్ ఖాన్‌‌కు హీరోగా స్టార్ డమ్ తీసుకొచ్చిన ‘మైనే ప్యార్ కియాతో’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆ తర్వాత పెళ్లిచేసుకొని హీరోయిన్ వేషాలకు దూరమైంది. ఇపుడు చాలా కాలం తర్వాత ప్రభాస్ తల్లి పాత్ర చేయడానికి ఓకే చెప్పింది. తెలుగులో ఈమెకు ఇది రెండో చిత్రం. గతంలో భాగ్యశ్రీ..కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘రాణా’లో హీరో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఇపుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.

veteran heroine bhagyashree play important role in prabhas latest movie,prabhas salman khan,prabhas bhagyashree,bhagyashree salman khan,prabhas bhagyashree,balakrishnaprabhas,prabhas 20,prabhas first look,prabahas sankranthi gift,prabhas saaho.prabhas sandeep reddy vanga,young rebel star prabhas,prabhas instagram,prabhas twitter,prabhas facebook,sandeep reddy vanga facebook,sandeep reddy vanga instagram,sandeep reddy vanga twitter,sandeep reddy vanga,arjun reddy,sandeep vanga,sandeep reddy,director sandeep reddy vanga,sandeep reddy interview,prabhas,arjun reddy movie,kabir singh director sandeep reddy,director sandeep vanga interview,sandeep raddy vanga and prabhas movie,ranbir kapoor and sandeep reddy vanga,sandeep raddy vanga movie with prabhas,prabhas - sandeep vanga combo fix,samantha about sandeep reddy vanga,bollywood,hindi cinema,telugu cinema,tollywood,ప్రభాస్,సాహో ప్రభాస్,సాహో,ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా,సందీప్ రెడ్డి వంగా,సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ మూవీ,ప్రభాస్ 20 ఫస్ట్ లుక్,ప్రభాస్ సంక్రాంతి లుక్,ప్రభాస్ సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ,భాగ్యశ్రీ,భాగ్యశ్రీ సల్మాన్ ఖాన్
భాగ్యశ్రీ, ప్రభాస్ (Twitter/Photo)


ఈ సినిమాలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ ఆస్ట్రియా బయలుదేరి వెళ్లనుంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ,తమిళం, కన్నడ,మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు