#vijayanirmala: చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన విజయనిర్మల..

అవును బాలనటిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి..ఆపై హీరోయిన్‌గా, దర్శకురాలిగా తెలుగు తెరపై కాకుండా దక్షిణాది సినిమా రంగంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్న విజయ నిర్మల.. నటిగా విభిన్న పాత్రలు పోషించడమే కాదు.. దర్శకురాలిగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి ఏ మహిల సాధించలేని ఘనతను సాధించడమే కాకుండా.. గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. కానీ విజయ నిర్మలకు ఒక తీరని కోరిక ఉంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 28, 2019, 2:51 PM IST
#vijayanirmala: చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన విజయనిర్మల..
విజయనిర్మల (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
అవును బాలనటిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టి..ఆపై హీరోయిన్‌గా, దర్శకురాలిగా తెలుగు తెరపై కాకుండా దక్షిణాది సినిమా రంగంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్న విజయ నిర్మల.. నటిగా విభిన్న పాత్రలు పోషించడమే కాదు.. దర్శకురాలిగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి ఏ మహిల సాధించలేని ఘనతను సాధించడమే కాకుండా.. గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. ఐతే..విజయ నిర్మల మాత్రం 50 సినిమాలకు దర్శకత్వం.. వహించాలన్న కల మాత్రం నెరవేరలేదు.  ఇక విజయ నిర్మల దర్శకురాలిగా మెగాఫోన్ పట్టుకున్న మొదటి చిత్రం మాత్రం తెలుగులో కాదు..మలయాళంలో ‘కవిత’ చిత్రంతో దర్శకురాలైంది. తెలుగులో ‘మీనా’ విజయ నిర్మల తొలి చిత్రం. ఆ తర్వాత తన దర్శకత్వంలో భర్త కృష్ణ హీరోగా ‘సాహసమే ఊపిరి’,‘శంఖుతీర్ధం’,హేమా హేమీలు’, ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ ‘అంతం కాదిది ఆరంభం’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.

Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల రికార్డు(ట్విట్టర్ ఫోటోస్)


ఇక విజయ నిర్మలకు ఇష్టమైన సినిమాల్లో నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్’ ఒకటి. ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో కృష్ణ హీరోగా ‘దేవదాస్’ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ సినిమా ఆశించింత విజయం సాధించలేకపోయినా.. ఈ సినిమా చిత్రీకరణ..టేకింగ్‌కు రమేష్ నాయుడు సంగీతానికి  మాత్రం మంచి మార్కులే పడ్డాయిఈ సినిమా పరాజయంతో ఇక దర్శకురాలిగా సినిమాలు తీయకూడదనే నిర్ణయానికి విజయనిర్మల వచ్చింది. ఇదే విషయం కృష్ణకి చెబితే.. సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్ అంటూ ఆమె ప్రోత్సహించారు. దీంతో ఆమె తన దర్శకత్వాన్ని కొనసాగించారు. అలా 44 చిత్రాలను డైరెక్ట్ చేసారు. మధ్యలో ఆరోగ్యం సహకరించలేదు. దీంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నారు. ఆమె మరలా 2013లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చూసిన తర్వాత ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో సినిమాల చేయాలనుకుంది. ఐతే.. ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు.దీంతో హాఫ్ సెంచరీ చేయాలన్న విజయ నిర్మల కల..నెరవేరకుండానే ఈ లోకాన్ని ఒదిలి వెళ్లిపోయారు.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com