Rishi Kapoor Passes Away : రిషి కపూర్ ఇక లేరు... ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూత..

Rishi Kapoor Passes Away : ప్రముఖ హిందీ నటుడు రిషికపూర్ (67) అనారోగ్యం పాలవడంతో ఆయన్ని బుధవారం రాత్రి ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.

news18-telugu
Updated: April 30, 2020, 10:28 AM IST
Rishi Kapoor Passes Away : రిషి కపూర్ ఇక లేరు... ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూత..
రిషి కపూర్ (rishi kapoor death)
  • Share this:
Rishi Kapoor Passes Away : ప్రముఖ హిందీ నటుడు రిషికపూర్ (67) అనారోగ్యం పాలవడంతో ఆయన్ని బుధవారం రాత్రి ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా శ్వాస సంబంద సమస్య ఉండటంతో చికిత్స తీసుకుంటున్నారు. కాగా సడెన్‌గా నిన్న అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో రిషి కపూర్‌ ఈ ఉదయం మరణించారు. రిషి కపూర్‌కు 2018లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఓ సంవత్సరానికి పాటు చికిత్స తీసుకున్నారు. ఇక రిషి కపూర్ సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. ఆయన తాజాగా ది బాడీ అనే సినిమాలో నటించారు. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు. రిషి కపూర్.. ప్రముఖ హిందీ యువ హీరో రణ్ బీర్ కపూర్‌కు తండ్రి అని తెలిసిందే.

రిషి కపూర్ 1952 సప్టెంబరు 4న ముంబయిలో జన్మించారు. ఈయన బాలీవుడ్‌ దిగ్గజం రాజ్‌కపూర్‌కు‌ రెండో సంతానం. రిషికపూర్ ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. రిషి.. 1973లో బాబీ చిత్రంతో హీరోగా‌ పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన ఆర్‌.కె.ఫిలిమ్స్ అనే‌ బ్యాన్‌ర్‌పై పలు చిత్రాలు నిర్మించారు.
Published by: Suresh Rachamalla
First published: April 30, 2020, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading