Vidya Sinha: ప్రముఖ హిందీ నటి విద్యా సిన్హా కన్నుమూత..

Vidya Sinha | బాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటి విద్యా సిన్హా (71) కన్ను మూసారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ముంబైలోని జుహూ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ  క్రమంలో ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూసినట్టు హాస్పటల్ వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: August 16, 2019, 6:50 AM IST
Vidya Sinha: ప్రముఖ హిందీ నటి విద్యా సిన్హా కన్నుమూత..
విద్యా సిన్హా (యూట్యూబ్ క్రెడిట్)
  • Share this:
బాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటి విద్యా సిన్హా (71) కన్ను మూసారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ముంబైలోని జుహూ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ  క్రమంలో ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూసినట్టు హాస్పటల్ వర్గాలు చెబుతున్నాయి. విద్యాసిన్హా విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ‘రజనీగంధ’, ‘చోటీ సీ బాత్’, ‘పతి పత్నీ ఔర్ వో’ తదితర చిత్రాల్లో నటించారు. 1947 నవంబర్ 15న జన్మించిన విద్యాసిన్హా.. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా పనిచేసారు. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టారు. ‘రాజుకాక’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. హిందీలో ఆమె హీరోయిన్‌గా నటించిన ‘రజనీగంధ’ చిత్రంతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.

veteran actress vidya sinha passes away the actress who redefined the urban middle class woman in bollywood,vidya sinha,vidya sinha passes away,vidya sinha movies,vidya sinha songs,actress vidya sinha,vidya sinha biography,vidya sinha age,vidya sinha hot,vidya sinha song,vidya sinha dies,who is vidya sinha,vidya sinha career,vidya sinha family,vidya sinha actress,vidya sinha dialogue,vidya sinha mim hot song,vidya sinha mim,vidya,vidya sinha bikini,vidya sinha mim songs,vidya sinha hit songs,vidya sinha daughter,vidya balan,bollywood,hindi cinema,విద్యా సిన్హా,విద్యాసిన్హా కన్నుమూత,విద్యా సిన్హా,బాలీవుడ్ నటి విద్యా సిన్హా కన్నుమూత,బాలీవుడ్ నటి విద్యా సిన్హా,చనిపోయిన విద్యా సిన్హా
‘విద్యాసిన్హా’ ఫైల్ ఫోటో


సినిమాల్లో పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే 1986లో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఆ తర్వాత 2011లో సల్మాన్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత ఆమె పలు టీవీ సీరియల్స్‌లో ముఖ్యపాత్రలు పోషించారు.

 

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...