శ్రీదేవి, జయప్రద.. కొన్ని దశాబ్దాల క్రితం వెండితెరను ఏలిన హీరోయిన్లు. బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో పోటీపడ్డ హీరోయిన్లు. అన్ని భాషల్లోనూ టాప్ స్టార్స్‌తో నటించిన ఈ వెటరన్ హీరోయిన్లలో శ్రీదేవి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఇక జయప్రద ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇండియన్ ఐడల్ 12 కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద అనే అంశాలపై తన మనసులోని మాటను బయటపెట్టింది. అనేక అంశాలపై మాట్లాడిన జయప్రద... తన తోటి నటి శ్రీదేవితో ఉన్న సంబంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు దశాబ్దాల పాటు పోటీపడి నటించిన ఈ ఇద్దరు హీరోయిన్లు ఆఫ్ స్క్రీన్‌లో కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా వివరించారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. యాక్షన్ అనగానే మాట్లాడుకోవడం కట్ అనగానే మళ్లీ ఎవరి పని వాళ్లు చూసుకోవడం తప్పితే.. రియల్ లైఫ్‌లో ఈ ఇద్దరు ఎప్పుడూ మాట్లాడుకోలేదు.
వీరి తీరు చూసిన నాటి బాలీవుడ్ స్టార్స్ రాజేశ్ ఖన్నా, జితేంద్ర.. ఓసారి షూటింగ్ సమయంలో వీరిద్దరి మేకప్ రూమ్‌లో ఇద్దరిని ఉంచి గంటపాటు తాళం వేశారట. అయినా ఆ గంట సమయంలోనూ వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని జయప్రద స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే తాను చనిపోయిందన్న వార్త తెలియగానే తాను ఎంతో బాధపడ్డానని.. తనతో ఎంతో మాట్లాడాలని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sridevi, Tollywood, Tollywood heroines