పవన్ కళ్యాణ్ తొలి సినిమా వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఎవ్వరికి పరిచయం అక్కర్లేదు. కానీ ఈయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం ఎన్నో..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 4, 2020, 8:53 PM IST
పవన్ కళ్యాణ్ తొలి సినిమా వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)
  • Share this:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఎవ్వరికి పరిచయం అక్కర్లేదు. కానీ ఈయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం ఎన్నో..? తమ్మున్ని పర్ఫెక్ట్‌గా లాంఛ్ చేయడానికి చాలా మంది దర్శకులను చెక్ చేసుకున్న తర్వాత చివరికి ఈవీవీ సత్యనారాయణ కుదిరాడు. అప్పటికే హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాను తెలుగులో ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి రీమేక్ చేసాడు ఈవీవీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా అక్కినేని వారమ్మాయి సుప్రియను తీసుకుని మెగా, అక్కినేని కుటుంబాల అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు ఈయన.
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)


ఇదిలా ఉంటే పవన్ పోస్టర్ డిజైన్స్.. ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేసాడు ఈవీవీ. ఆ రోజుల్లోనే ఈయన చేసిన ప్రమోషన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించారు.. సినిమా విడుదలకు ముందు ఇతడే మన కళ్యాణ్ అంటూ మరో పోస్టర్స్ విడుదల చేసారు. దాంతో ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దానికి తోడు చిరంజీవి తమ్ముడు అంట అంటూ అంచనాలు కూడా పెరిగిపోయాయి. అలా వచ్చింది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)
పవన్ కళ్యాణ్ తొలి సినిమా ముచ్చట్లు (pawan kalyan debut movie)

ఈ సినిమా మొదట్లో కూడా ఇతడే మనకు కావాల్సిన కళ్యాణ్ బాబూ అంటూ వేసాడు దర్శకుడు ఈవీవీ. ఇలా ప్రతీ విషయంలోనూ పవన్‌ను అద్భుతంగా ప్రమోట్ చేసాడు. ఇక ఇందులో పవన్ చేసిన రియల్ ఫీట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా ఓ ఐటం సాంగ్ చేసింది. ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, కమెడియన్స్ అంతా ఈ సినిమాలో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ అయినా కూడా పవన్ కెరీర్‌కు పర్ఫెక్ట్ లాంఛ్ అయింది. ఆ తర్వాత ఖుషీ వరకు వరస విజయాలతో టాప్ హీరో అయిపోయాడు పవర్ స్టార్.
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading