హోమ్ /వార్తలు /సినిమా /

చెన్నై MGM హాస్పిటల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం.. ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ఎస్పీ బాలు సన్నిహితులు..

చెన్నై MGM హాస్పిటల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం.. ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ఎస్పీ బాలు సన్నిహితులు..

5. ఎస్పీ బాలసుబ్రమణ్యం: 53 ఏళ్ల పాటు పాటలు పాడి అలరించిన దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా 2001లో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన దాదాపు 40 వేల పాటలు పాడారు.

5. ఎస్పీ బాలసుబ్రమణ్యం: 53 ఏళ్ల పాటు పాటలు పాడి అలరించిన దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా 2001లో గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన దాదాపు 40 వేల పాటలు పాడారు.

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఈయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత 24 గంటలుగా ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఎంజిఎం..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఈయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత 24 గంటలుగా ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఎంజిఎం వైద్యబృందం హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. దాంతో ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాలు ఆరోగ్యం కుదుటపడాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు సంగీత ప్రియులు. ఇదిలా ఉంటే తాజాగా బాలు చికిత్స పొందుతున్న చెన్నై ఎంజిఎం హాస్పిటల్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఒక్కొక్కరుగా ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balu)
ఎస్పీ బాలసుబ్రమణ్యం (sp balu)

ఆయన బంధువులు, సన్నిహితులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంజిఎం దగ్గరికి వస్తున్నారు. ఆయన పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఈయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని చెప్పడంతో బాలు సన్నిహితులు అంతా అక్కడికి చేరుకుంటున్నారు. చెన్నైలోనే ఎస్పీ బాలు ఉంటున్నాడు.. ఆయన తనయుడు కూడా అక్కడే ఉంటాడు. దాంతో ఎంజిఎంకు క్యూ కడుతున్నారు. బాలు ఆరోగ్యంపై మరో హెల్త్ బులెటిన్ మరికాసేపట్లో విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు