Home /News /movies /

VENU THOTTEMPUDI REVEALS HIS FITNESS SECRETS IN INTERVIEW SB

Venu Thottempudi: శరీరాన్ని పాడు చేసే ఏ అలవాటు లేదు.. అదే నా సీక్రేట్..!

వేణు అప్పటికే ఇప్పటికే ఒకేలా ఉన్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నా.. ఆయన అప్పటిలాగా కనిపించాడు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రేట్ బయటపెట్టేశారు వేణు.

వేణు అప్పటికే ఇప్పటికే ఒకేలా ఉన్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నా.. ఆయన అప్పటిలాగా కనిపించాడు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రేట్ బయటపెట్టేశారు వేణు.

వేణు అప్పటికే ఇప్పటికే ఒకేలా ఉన్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నా.. ఆయన అప్పటిలాగా కనిపించాడు. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ సీక్రేట్ బయటపెట్టేశారు వేణు.

    ''రామారావు ఆన్ డ్యూటీ''  సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు హీరో తొట్టెంపూడి. ఈ సినిమా తనకు  నటుడిగా చాలా తృప్తిని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. స్వయంవరం లో మీతో కలసి చేయాలనీ రవితేజ గారు చెప్పారు కదా? దాని గురించి  చెప్పండి అని అడిగి ప్రశ్నకు.. నిజంగా ఆ విషయం అంతకుముందు తనకు తెలీయదన్నారు. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీతో మా కాంబినేషన్ కుదిరిందన్నారు వేణు. మొదటి నుండి నేను మల్టీ స్టారర్ కి మొగ్గు చూపేవాడినన్నారు. '

    చిరునవ్వుతో' లాంటి సూపర్ హిట్ ఇచ్చినప్పటికీ వెంటనే హనుమాన్ జంక్షన్ చేశానన్నారు. చాలా మంది నటీనటులతో కలసి నటించడం అంటే అదొక పండగలా ఉంటుందన్నారు. ఇక హనుమాన్ జంక్షన్ కూడా ఒక పండగలా గడిచిందన్నారు వేణు.  త్రివిక్రమ్ వేణు సినిమాలకు రచయితగా పనిచేశారు. అయితే ఇప్పుడు త్రివక్రమ్ డైరెక్టర్ కావడంతో... ఆయన సినిమాల్లో తనకు సరిపడే పాత్ర వుంటే ఖచ్చితంగా చెప్తారన్నారు. అతడు సినిమాలో సోనూ సూద్ పాత్ర మొదట తనకే చెప్పారన్నారు. అయితే  తాను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారని తెలిపారు. ఈ పాత్రకి వేణు బావుంటాడని అనిపిస్తే తప్పకుండా త్రివిక్రమ్ చెప్తారన్నారు. 

    ఇక రవితేజ గారితో పని చేయడం గొప్ప అనుభవమన్నారు వేణు. ఆయన చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్ వుంటారని కొనియాడారు. అయితే మొదటి సినిమాలో చూసిన వేణుకు .. ఇప్పుడు వేణుకు మాత్రం పెద్ద తేడా ఏం లేదు. దాదాపుగా ఆయన అలానే ఉన్నారు. అయితే హెల్త్ సీక్రేట్ ఏంటి అని అడిగితే.. మంచి ఆహరం తినడం తప్ప మరో అలవాటు లేదు. శరీరాన్ని పాడుచేసే ఏ అలవాటు తనకు లేదన్నారు. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్ కు దూరంగా వుంటానన్నారు. ఇక మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదమన్నారు. ఇక ఇప్పటి నుంచి కచ్చితంగా సినిమాలని కంటిన్యూ చేస్తానన్నారు వేణు. అలాగే వెబ్ కంటెంట్ పై కూడా ప్రత్యేకంగా ద్రుష్టి వుందన్నారు. ఛాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నానని. అలాగే ఒక వెబ్ సిరిస్ కూడా చర్చల్లో వుందని తెలిపారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rama Rao On Duty, Ravi Teja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు