Home /News /movies /

VENU THOTTEMPUDI INTERVIEW ABOUT RAVI TEJA MOVIE RAMA RAO ON DUTY SB

Venu: ‘దమ్ము’ సినిమా తర్వాతే అందుకే తెరపై మళ్లీ కనిపించలేదు..!

రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుందన్నారు వేణు తొట్టెంపూడి.  రామారావు ఆన్ డ్యూటీలో తానే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చిందన్నారు.

రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుందన్నారు వేణు తొట్టెంపూడి. రామారావు ఆన్ డ్యూటీలో తానే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చిందన్నారు.

రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుందన్నారు వేణు తొట్టెంపూడి. రామారావు ఆన్ డ్యూటీలో తానే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చిందన్నారు.

    మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అవుతుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సిఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల నేపధ్యంలో విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు వేణు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ... ''దమ్ము'' తర్వాత సినిమాలు చేయకపోవడానికి కారణాలు తెలిపారు.

    నిజానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవన్నారు వేణు. తనకు ఫ్యామిలీ బిజినెస్స్ చాలా వున్నాయని.. ఆ బిజినెస్ లో బిజీ అయిపోయానన్నారు. సినిమాల గురించి అలోచించే తీరికే లేకుండాపోయిందని తెలిపారు. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా వద్దనే వాడినన్నారు. అయితే కరోనాకి థాంక్స్ చెప్పుకోవాలి. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని రకరకాల సినిమాలకు వెబ్ సీరిస్లు చూడ్డం మొదలుపెట్టానన్నారు వేణు.

    అప్పుడు మళ్ళీ సినిమాపై ఆసక్తి మళ్ళిందన్నారు. మంచి పాత్రలు చేయాలనిపించింది.. ఇలాంటి సమయంలో దర్శకుడు శరత్ మండవ రామారావు ఆన్ డ్యూటీ కథ చెప్పారు. కథ అద్భుతంగా వుందని.. సిఐ మురళిగా నా పాత్ర గురించి చెప్పారన్నారు. అయితే ఆ పాత్ర చాలా బావుంది...ఇలాంటి పాత్ర నేను ఎప్పుడూ చేయలేదన్నారు. ఇలాంటి జోనర్ కూడా ఫస్ట్ టైమ్ అన్నారు వేణు. రవితేజ గారి లాంటి మాస్ స్టార్ సినిమాతో మళ్ళీ నేను రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా వుందన్నారు.



    అలాగే రామారావు ఆన్ డ్యూటీ వైడ్ రీచ్ వున్న సినిమా అని.. ఇలాంటి సినిమా చేస్తే తాను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే ఆసక్తితో ఈ సినిమా చేశాన్నారు. అలాగే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ తనకు తానుగా డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి వుండేదన్నారు వేణు. కానీ రామారావు ఆన్ డ్యూటీలో తానే డబ్బింగ్ చెప్పడం ఒక తృప్తిని ఇచ్చిందన్నారు. రామారావు ఆన్ డ్యూటీ తో తనకు మళ్ళీ ఒక ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్ చెరుకూరి, శరత్ మాండవకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు వేణు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rama Rao On Duty, Tollywood

    తదుపరి వార్తలు