Home /News /movies /

VENU THOTTEMPUDI CHARACTER UNVEILED IN RAMARAO ON DUTY SB

Ravi Teja: రవితేజ సినిమాతో పదేళ్ల తర్వాత.. పవర్ ఫుల్‌ రోల్‌లో మరో హీరో..!

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి.

    మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా.. రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ సీనియర్ నటుడిగా వెలుగొందిన వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) ఈ సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. తొమ్మిదేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. మాస్ మహారాజా రవితేజ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు పదేళ్ల పాటు సుదీర్ఘ విరామం తరవ్ాత వేణు మరోసారి వెండితెరపై కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించాడు. దీంతో అతని క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను టీం ఆవిష్కరించారు.

    సీఐ మురళిగా పరిచయం అవుతున్న వేణు పోస్టర్‌లో కాస్త సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు సినిమా మొత్తం రవితేజతో కలిసి ప్రయాణిస్తుంది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ మురళీగా పవర్ ఫుల్ రోల్ ను పోషిస్తున్నాడు వేణు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రవితేజ కూడా ఈ సినిమాలో ఇకముందు ఎప్పుడూ కనిపించని పాత్రలో ఫ్యాన్స్ సర్ ప్రైజ్ చేయనున్నాడు. పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి, అదేవిధంగా అవినీతిని నిర్మూలించే నిజాయితీగల సివిల్ సర్వెంట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.



    ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా మూడో సింగిల్ సీసా జనాలను కవ్వించింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేయనున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

    ప్రవీణ్ కెఎల్ ఎడిటర్. రామారావు ఆన్ డ్యూటీ... చిత్రాన్ని జూలై 29న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు కూడా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rama Rao, Raviteja

    తదుపరి వార్తలు