వెంకీ మామ ట్రైలర్ రివ్యూ.. వెంకటేష్, నాగ చైతన్య అదరగొట్టారుగా..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లు కాస్తా ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 8:07 PM IST
వెంకీ మామ ట్రైలర్ రివ్యూ.. వెంకటేష్, నాగ చైతన్య అదరగొట్టారుగా..
‘వెంకీ మామ’ బర్త్ డే గిఫ్ట్ (Twitter/Photo)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లు కాస్తా ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. వాళ్లే వెంకటేష్, నాగచైతన్య. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా వెంకీ మామ. టైటిల్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. క్లాస్ ప్లస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్ కట్ చేసాడు దర్శకుడు బాబీ.
Venky Mama movie trailer review and Venkatesh Naga Chaitanya screen presence was fantastic pk తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లు కాస్తా ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. venky mama movie,venky mama trailer released,venky mama first glimpse,venky mama,venky mama twitter,venky mama trailer,venky mama offcial trailer,venkatesh naga chaitanya,naga chaitanya twitter,venky mama twitter,venky mama movie release date,telugu cinema,వెంకటేష్,నాగచైతన్య,వెంకీ మామ ట్రైలర్,తెలుగు సినిమా
వెంకీ మామ (Twitter/Photo)


ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మామా అల్లుళ్లుగా కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్నారు వెంకీ, చైతూ. రారా అల్లుడు వేట నేర్పుదాం అంటూ వెంకీ, చైతూ ఇద్దరూ అదరగొట్టారు. ఆ మధ్య పోస్టర్స్‌లో కూడా పంచెలు కట్టుకుని ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని నడుచుకుంటూ వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను అలరించింది. టీజర్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు ట్రైలర్ అయితే పూర్తిగా కామెడీతో పాటు యాక్షన్ డ్రామాను చూపించాడు దర్శకుడు బాబీ.

మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం.. నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు.. ఈ సారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంలో ఎరుపెక్కిస్తాను.. రండ్రా నా కొడకల్లారా.. వాళ్లు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించి వస్తాను సర్.. అంటూ పవర్ ఫుల్ డైలాగులతో రెచ్చిపోయారు వెంకీ, చైతూ. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 13న విడుదల కానుంది ఈ చిత్రం.
Published by: Praveen Kumar Vadla
First published: December 7, 2019, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading