వెంకటేష్, నాగచైతన్య లుక్ సూపర్.. అదిరిపోయిన వెంకీ మామ పంచె లుక్..

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లు కాస్తా ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 2, 2019, 9:13 PM IST
వెంకటేష్, నాగచైతన్య లుక్ సూపర్.. అదిరిపోయిన వెంకీ మామ పంచె లుక్..
వెంకీ మామా వినాయక చవితి పోస్టర్ (Source: Twitter)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజ జీవితంలో మామా అల్లుళ్లు కాస్తా ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. వాళ్లే వెంకటేష్, నాగచైతన్య. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా వెంకీ మామ. టైటిల్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మామా అల్లుళ్లుగా కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్నారు వెంకీ, చైతూ. పంచెలు కట్టుకుని ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుుకని నడుచుకుంటూ వస్తున్న ఈ పోస్టర్ అభిమానులను అలరిస్తుంది. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో వెంకటేష్ రైస్ మిల్ ఓనర్‌గా.. నాగచైతన్య సైనికుడిగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.
First published: September 2, 2019, 9:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading