‘వెంకీ మామ’ విషయంలో ఆ పప్పులు ఉడకవు.. సురేష్ బాబు సంచలనం..

news18-telugu
Updated: December 10, 2019, 9:39 AM IST
‘వెంకీ మామ’ విషయంలో ఆ పప్పులు ఉడకవు..  సురేష్ బాబు సంచలనం..
నిర్మాత సురేష్ బాబు
  • Share this:
ఈ మధ్యకాలంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ సొంతంగా కాకుండా.. వేరే వాళ్లతో కలిసి సినిమాలను నిర్మిస్తోంది. లేకపోతే.. ఎవరైనా  మంచి కంటెంట్‌తో సినిమా తెరకెక్కిస్తే.. ఈ సినిమా రైట్స్ కొనుక్కొని మరి రిలీజ్ చేస్తున్నాడు సురేష్ బాబు. తాజాగా ఈయన తన తమ్ముడు వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా వెంకటేష్ పుట్టినరోజున విడుదల కానుంది.ఈ సినిమాలో వెంకటేష్ సరసన  పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అమెజాన్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయబోమని ప్రకటించాడు.

Victory Venkatesh superb satire on his brother and producer Suresh Babu in Venky Mama Press meet pk వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే కన్ఫ్యూజన్‌కు తెరదించుతూ డిసెంబర్ 13 అని అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి.. venkatesh,venkatesh naga chaitanya,venkatesh venky mama,venkatesh venky mama press meet,venkatesh suresh babu,venkatesh venky mama release date,venkatesh venky mama press meet,venkatesh naga chaitanya venky mama press meet,venkatesh satires on suresh babu,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ నాగ చైతన్య,వెంకటేష్ సురేష్ బాబు,తెలుగు సినిమా,వెంకీ మామ ప్రెస్ మీట్
వెంకీ మామ పోస్టర్స్


అంతేకాదు తొందర్లనే అల్లు అరవింద్, దిల్ రాజులతో కలిసి అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా మేమే ఒక డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చాడు. అంతేకాదు తెలుగుకు సంబంధించిన సినిమాలే కాదు.. హిందీ, తమిళానికి సంబంధించిన సినిమాలను కూడా కొనుగోలు చేసి ఆయా కంపెనీలు గట్టిపోటీ ఇవ్వాలనే కసి మీదున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు అన్ని థియేటర్స్ ఆయా నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. వీళ్లను కాకుండా సినిమాలు విడుదల చేసే ఆస్కారం ఉండదు. కాబట్టి తెలుగులో తెరకెక్కబోయే సినిమాలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు చేతిలోనే ఉండే అవకాశం ఉంది.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>