‘ప్రేమమ్’ సినిమాలో కాసేపు వెండితెరపై కనిపించి అభిమానులను కనువిందు చేసిన రియల్ లైఫ్ మామ అల్లుళ్లైన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ సినిమాలో పూర్తి స్థాయిలో కలిసి నటించారు. ఈ చిత్రానికి తొలి రోజు మంచి టాక్ వచ్చింది. అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్న వెంకీ మామ కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉండటంతో తొలిరోజు కలెక్షన్లలో దుమ్ము దులిపింది. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించింది. అటు నాగ చైతన్య.. ఇటు వెంకటేష్ కెరీర్లో హైయ్యస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు తీసుకొచ్చింది వెంకీ మామ. మౌత్ టాక్ యావరేజ్‌గానే ఉన్నప్పటికీ రెండో రోజు కూడా మంచి వసూళ్లు తీసుకొస్తుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం.. ఎమోషనల్ ఎంటర్టైనర్ కావడంతో వెంకీ మామ వైపు ప్రేక్షకుల అడుగులు పడుతున్నాయి.
తొలిరోజు.. రూ.7.40 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా రూ.5.2 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. మూడో రోజు.. 5 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.17.78 కోట్ల షేర్ రాబట్టిన ఈచిత్రం.. ఓవరాల్‌గా రూ.45కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఏ సినిమాకైనా మూడు రోజుల కలెక్షన్స్ బాగానే వస్తాయి. కానీ వీకెండ్ తర్వాత తట్టుకొని నిలబడితేనే సక్సెస్ సాధించినట్టు. ఈ లెక్కన ఈ సోమవారం బాక్సాఫీస్ దగ్గర మామ అల్లుళ్లు ఏ మేరకు కలెక్షన్లు రాబడతారనే దానిపై ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bobby, Box Office Collections, Naga Chaitanya Akkineni, Suresh Babu, Suresh Productions, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report, Venkatesh, Venky Mama